మోపిదేవిని ప్రశ్నిస్తున్న ఎసిబి, మద్యం సిండికేట్లపై

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ అక్రమాస్తుల కేసులో అరెస్టు అయి చంచల్‌గూడ జైలులో ఉంటున్న మోపిదేవి వద్ద ఎసిబిఅధికారులు విచారిస్తున్నారు. ఈ విచారణ జైలులోనే కొనసాగుతోంది. మద్యం సిండికేట్ల నుంచి కోట్లాది రూపాయల మేరకు మోపిదేవి లంచాలు స్వీకరించినట్టు పలువురు వ్యాపారులు ఆరోపించిన విషయం తెల్సిందే.
ఒక మద్యం దుకాణం వివాదం పరిష్కారానికి మోపిదేవి పది కోట్ల రూపాయల మేరకు లంచం తీసుకున్నట్టు తెలంగాణ ప్రాంతానికి చెందిన ఒక వ్యాపారి ఆరోపించారు. అలాగే, సిండికేట్ల వ్యవహారంలో అవకతవకలు చోటు చేసుకున్నట్టు ఆరోపణలు రావడంతో మోపిదేవి వద్ద విచారణ సాగుతోంది.
తాను ముడుపులు తీసుకున్నట్లు వచ్చిన ఆరోపణలను మోపిదేవి వెంకటరమణ అప్పట్లో ఖండించారు. మద్యం దుకాణాలపై అప్పట్లో ఎసిబి అధికారులు పెద్ద యెత్తున దాడులు నిర్వహించారు. పలువురిని అరెస్టు చేశారు. రాజకీయ నాయకులను కూడా విచారించారు. కొంత మంది శానససభ్యులను కూడా ఈ వ్యవహారంలో విచారించారు.












Click it and Unblock the Notifications