తెలంగాణ అంశాన్ని కేంద్రంపైకి నెట్టిన జగన్ పార్టీ నేత

Vasireddy Padma
హైదరాబాద్: తెలంగాణ అంశాన్ని తేల్చాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత వాసిరెడ్డి పద్మ అన్నారు. తెలంగాణ అంశంపై కేంద్రం నిర్ణయం తీసుకోవాలని ఆమె అన్నారు. ఉద్రిక్తతలను తగ్గించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని ఆమె బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. తెలంగాణపై స్పష్టమైన వైఖరి చెప్పని పార్టీల్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఉందని అప్పటి కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం అంటూ వచ్చారు.

తన పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసును దర్యాప్తు చేస్తున్న సిబిఐ తీరుపై ఆమె తీవ్రంగా మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డికి ఒక న్యాయం, మంత్రి ధర్మాన ప్రసాదరావుకు మరో న్యాయమా అని ఆమె అడిగారు. ధర్మాన బెయిల్ తీసుకుని బయటకు వచ్చారని, జగన్ బెయిల్ విచారణకు వచ్చిన ప్రతిసారీ బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తారని అంటోందని ఆమె అన్నారు. మంత్రులు, అధికారులు సాక్షులను ప్రభావితం చేయరా అని ఆమె అడిగారు.

ధర్మాన ప్రసాదరావు బెయిల్ విషయంలో సిబిఐ ఎందుకు మౌనంగా ఉందని ఆమె అడిగారు. జగన్ పట్ల సిబిఐ కక్షపూరిత వైఖరి బయటపడిందని ఆమె అన్నారు. ఒకే కేసులో అధికారులు బయట ఉండవచ్చు, జగన్ మాత్రం జైలులో ఉండాలా అని ఆమె అడిగారు.

ఒక్క సాక్షినైనా జగన్ ప్రభావితం చేశాడని సిబిఐ నిరూపించగలదా అని ఆమె ప్రశ్నించారు. జగన్‌కు బెయిల్ రాకుండా కుట్ర జరుగుతోందని, కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు కుమ్మక్కయి జగన్‌కు వ్యతిరేకంగా కుట్ర చేస్తున్నాయని ఆమె విమర్శించారు. జీవోలు జారీ చేసిన మంత్రులు తమపై వచ్చినవి ఆరోపణలు మాత్రమే, నేరం రుజువు కాలేదని అంటున్నారని అంటూ అవే ఆరోపణలు ఎదుర్కుంటున్న జగన్‌కు బెయిల్ రాకుండా ఎందుకు అడ్డుకుంటున్నారని ఆమె అడిగారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+