బిజెపి,టిఎన్జీవో ర్యాలీపై బాష్పవాయువు, రబ్బర్‌బుల్లెట్స్

పోలీసులు ససేమీరా అనడంతో కార్యకర్తలు ముళ్ల కంచె, బారీకేడ్లు తొలగించి వెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు బిజెపి కార్యకర్తలను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. కార్యకర్తలు పోలీసుల పైకి రాళ్లు రువ్వారు. పోలీసులు బాష్పవాయువు, రబ్బర్ బుల్లెట్లు ప్రయోగించారు. అదే సమయంలో ర్యాలీగా వచ్చిన ప్రజా సంఘాలు కూడా పోలీసులపై ఎదురు దాడికి దిగింది. ఈ ఘటనలో ఇరవై మంది తెలంగాణవాదులకు గాయాలయ్యాయి.
సచివాలయం నుండి భారీగా తెలంగాణ ఉద్యోగులు కవాతు వేదిక వైపుకు వెళ్లే ప్రయత్నాలు చేశారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు. బుద్ధ భవన్ వద్ద ఉన్న బారీకేడ్లను, ముళ్లకంచెను ఉద్యోగులు ధ్వంసం చేశారు. పోలీసులు వారిపై టియర్ గ్యాస్, వాటర్ కేనన్లు ప్రయోగించారు. పలువురు బిజెపి కార్యకర్తలు కిమ్స్ నుండి వేదిక వద్దకు వచ్చే ప్రయత్నాలు చేశారు. పోలీసులు వారిని అడ్డుకొని బాష్పవాయువు ప్రయోగించారు.
పివి ఘాట్ వెనుక నుండి న్యూడమెక్రసీ కార్యకర్తలు వేదిక వద్దకు వచ్చే ప్రయత్నాలు చేయగా పోలీసులు బాష్పవాయువు ప్రయోగించారు. ఖైరతాబాద్ వద్ద పలువురు తెలంగాణవాదులు ముళ్ల కంచె దూకే యత్నం చేశారు. పోలీసులు వారిని అడ్డుకొని లాఠీఛార్జ్ చేశారు. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. కాగా వరంగల్ జిల్లా రఘునాథపల్లి వద్ద పోలీసులు పాట్నా ఎక్స్‌ప్రెస్‌ను నిలిపేశారు. మార్చ్‌కు వస్తున్న వంద మంది తెలంగాణవాదులను అరెస్టు చేశారు. మరోవైపు ఓయులో ఉద్రిక్తత కొనసాగుతోంది. ఐదు గంటలుగా పోలీసులు బాష్పవాయు గోళాలు, తుపాకీ గుళ్లతో ఓయు దద్దరిల్లుతోంది.












Click it and Unblock the Notifications