టిఆర్ఎస్ భవన్ వద్ద కలకలం: వ్యక్తి ఆత్మహత్యాయత్నం

TRS Bhavan
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి కార్యాలయం తెలంగాణ భవన్ వద్ద ఓ యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం కలకలానికి దారి తీసింది. రాజకీయ పార్టీలు, నేతల వల్లే తెలంగాణ ఏర్పాటులో జాప్యం అవుతోందని ఆరోపిస్తూ ఆ యువకుడు ఒంటిపై పెట్రోల్ పోసుకని నిప్పంటించుకున్నాడు. వెంటనే అప్రమత్తమైన తెలంగాణవాదులు మంటలను ఆర్పివేసి అతనిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.

టి.కాంగ్ ఎంపీల అరెస్టుపై ఖండన

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి క్యాంప్ కార్యాలయం ముందు బైఠాయించిన తెలంగాణ ప్రాంత కాంగ్రెసు పార్లమెంటు సభ్యులను అరెస్టు చేయడాన్ని పంచాయతీరాజ్ శాఖ మంత్రి జానా రెడ్డి, ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహలు ఖండించారు. ఎంపీల అరెస్టుపై దామోదర అసహనం వ్యక్తం చేశారు. ఎంపీల అరెస్టు సరికాదన్నారు. అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని దామోదర డిమాండ్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+