వైఎస్ విగ్రహధ్వంసం: శంకరన్న ఫైర్, మంత్రులు డుమ్మా

ప్రభుత్వం తెలంగాణ కవాతుకు అనుమతించిందని, అయినప్పటికీ పోలీసులు తెలంగాణవాదులను అరెస్టు చేశారని, ఇది సరికాదన్నారు. నిన్నటి కవాతుపై కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ఉక్కుపాదం మోపిందని, దీంతో ఇది సీమాంధ్ర ప్రభుత్వమని తేలిపోయిందని ఆయన ఆరోపించారు.
జెఏసి ప్రకటన సరికాదు.. గండ్ర
ఇక నుండి తమ లక్ష్యం మంత్రులే అని తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరామ్ చేసిన ప్రకటనను ప్రభుత్వం చీప్ విఫ్ గండ్ర వెంకటరమణ రెడ్డి తప్పు పట్టారు. మంత్రులే టార్గెట్ అని చెప్పడం సరికాదన్నారు. మంత్రులు తెలంగాణకు అనుకూలంగానే ఉన్నారని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రజల ఆకాంక్షను గుర్తించే వ్యక్తి అని ఆయన కితాబు ఇచ్చారు.
భేటీకి 10 మంది మంత్రులు డుమ్మా
తెలంగాణ కోసం అందరు కలిసి ఢిల్లీ వెళ్లాలని తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులు నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. భవిష్యత్తు కార్యాచరణ కోసం ఎంపీలు మినిస్టర్స్ క్వార్టర్స్‌లో భేటీ అయ్యారు. ఈ భేటీలో నలుగురు పార్లమెంటు సభ్యులు, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ పాల్గొన్నారు. భేటీకి పదిమంది మంత్రులు, ముగ్గురు ఎంపీలు గైర్హాజరయ్యారు. పౌరసరఫరాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు మినిస్టర్స్ క్వార్టర్స్‌లోనే ఉన్నప్పటికీ ఆయన భేటీకి రాలేదు.












Click it and Unblock the Notifications