తెలంగాణవాదులు మాటతప్పారు, సిట్‌కు కేసులు: సిపి

తెలంగాణ ఐకాస ప్రతినిధుల మాటలు నమ్మి కవాతుకు అనుమతి ఇచ్చామని, అయితే వారు దానిని శాంతియుతంగా నిర్వహించుకోలేదని పేర్కొన్నారు. మరోవైపు ఓయూ ఐకాస విద్యార్థులు పోలీసులపై రాళ్లు రువ్వారని, సొంతంగా ట్యాంక్‌బండ్‌పై మార్చ్ నిర్వహిస్తామని చెప్పడంతో ఓయూలోని ఎన్‌సిసి గేటు వద్దే పోలీసులు అడ్డుకున్నారని వివరించారు. గణేశ్ నిమజ్జనం ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల వరకు జరిగిందని చెప్పారు. మార్చ్ సందర్భంగా ఏర్పాటు చేసిన బారికేడ్లను ఆందోళనకారులు ధ్వంసం చేసి.. పోలీసులపై రాళ్ళు రువ్వారని చెప్పారు.
హింసాత్మకంగా వ్యవహరించారని ఆరోపించారు. ఈ ఘటనల్లో 25 మందికి గాయాలయ్యాయని, రాజశేఖర్ అనే ఐపిఎస్ అధికారికి కూడా దెబ్బలు తగిలాయని చెప్పారు. నెక్లెస్ రోడ్డులోని రైల్వేస్టేషన్, పార్కు, హోటల్‌లో ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారని వివరించారు. మార్చ్‌లో వామపక్ష తీవ్రవాదులు జొరబడ్డారని పేర్కొన్నారు. ముందస్తుగా కొంతమందిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. జీవ వైవిధ్య సదస్సుకు వచ్చే ప్రతినిధులకు పూర్తి భద్రత కల్పిస్తామని పేర్కొన్నారు.
పోలీసుల వైపు నుంచి ఏ ఒక్కరినీ ఇబ్బంది పెట్టలేదని, జరిగిన హింసకు పోలీసులను బాధ్యులుగా చేయాలని చూస్తున్నారని, సమయం దాటినా వాళ్లే వెళ్లిపోతారని అనుకున్నామని, కానీ అలా జరగలేదన్నారు. మొత్తం మీద మార్చ్ ప్రశాంతంగా జరగలేదన్నారు. తెలంగాణ మార్చ్ కేసులను సిట్‌కు అప్పగిస్తున్నామని తెలిపారు. ఒకవేళ మీడియాపై పోలీసులు దాడిచేస్తే అది తప్పేనని పేర్కొన్నారు. తెలంగాణ కవాతులోకి వామపక్ష తీవ్రవాదులు ప్రవేశించినట్లుగా అనుమానిస్తున్నామన్నారు.












Click it and Unblock the Notifications