జెఏసితో విభేదాలు లేవు: కెసిఆర్, కలిసిన న్యూడెమోక్రసీ

కాగా, కెసిఆర్‌తో భేటీ అనంతరం సూర్యం తదితరులు మీడియాతో మాట్లాడారు. టిఆర్ఎస్‌కు, జెఏసికి మధ్య విభేదాల్లేవని వెల్లడించారు. మార్చ్ విజయవంతంలో టిఆర్ఎస్ అద్భుతమైన పాత్ర పోషించిందని, ఒకవేళ జెఏసితో తేడా ఉంటే ఆ పార్టీ నుంచి అంత పెద్దఎత్తున కార్యకర్తలు వచ్చేవారు కాదని వివరించారు. "ఆంక్షలు విధించినా లక్షలాది మంది హాజరై విజయవంతం చేసిన మార్చ్ స్ఫూర్తిని ఎలా ముందుకు తీసుకు వెళ్లాలన్నారు.
ప్రత్యేక రాష్ట్రాన్ని ఎలా సాధించుకోవాలనే దిశగా మా మధ్య చర్చలు సాగాయి. ఢిల్లీలో చర్చలు జరుగుతుండాలి. అదే సమయంలో స్థానికంగా ఉద్యమ ఉధృతి ఉండాలనే అభిప్రాయం వ్యక్తమైంది'' అని తెలిపారు. అధికార కాంగ్రెస్ పార్టీ తనంతట తానుగా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయదని చరిత్ర చెబుతోందని, రాష్ట్రం ఇవ్వక తప్పని అనివార్య పరిస్థితి కేంద్రానికి కల్పించేలా ప్రజల ఒత్తిడిని పెంచాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. కెసిఆర్‌తో చర్చలు అసాధారణం కాదని ఆ పార్టీకి చెందిన మరో నేత కె.గోవర్ధన్ చెప్పారు.












Click it and Unblock the Notifications