జగన్ దెబ్బకు మారిన బాబు, అన్నీ అబద్దాలే: అంబటి

Ambati Rambabu
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తన వస్తున్నా మీకోసం పాదయాత్రలో చెప్పేవన్నీ పచ్చి అబద్దాలని, ఆయన ఎప్పుడూ నిజాలు మాట్లాడరని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు సోమవారం ధ్వజమెత్తారు. ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. గ్యాస్ ధర, ఉచిత విద్యుత్, వికలాంగుల పెన్షన్ల విషయంలో చంద్రబాబు పచ్చి అబద్ధాలు చెబుతూ ప్రజలను మభ్య పెడుతున్నారని దుయ్యబట్టారు.

తాను ముఖ్యమంత్రిగా ఉన్నపుడు రూ.180 మాత్రమే ఉన్న గ్యాస్ సిలిండర్ ధర ఇపుడు రూ.414కు పెరిగిందని బాబు చెప్పుకోవడం పెద్ద అబద్ధమన్నారు. 1994లో కాంగ్రెస్ అధికారంలో నుంచి దిగిపోయేటపుడు సిలిండర్ ధర రూ.115 ఉండేదని, 2004లో బాబు పాలన ముగిసేటప్పటికి అది రూ.305కు పెరిగిందన్నారు. దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి ఐదేళ్ల పాలనలో ఒక్క పైసా కూడా పెరగలేదన్నారు.

2008లో కేంద్రం సిలిండర్‌పై రూ.50 పెంచినా.. ఆ భారాన్ని కూడా రాష్ట్రమే భరించేలా చర్యలు తీసుకుని రూ.305కు మించనీయని ఘనత వైయస్‌దే అన్నారు. బాబు తన తొమ్మిదేళ్ల పాలనలో గ్యాస్ ధర పెరిగినపుడల్లా తనకేం సంబంధం లేదనీ, పెంచింది కేంద్రమేనని నెట్టేశారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు వికలాంగులు, వృద్ధులు, వితంతువులకు బాబు ఇచ్చిన పెన్షన్ కేవలం 75 రూపాయలేనని, అది కూడా రాష్ట్రం మొత్తం మీద 19 లక్షల మందికి మాత్రమే ఇచ్చారన్నారు.

ఇప్పుడేమో తాను మళ్లీ అధికారంలోకి వస్తే రూ.1500 ఇస్తానని చెప్పడం సరికాదన్నారు. నిజాలు చెబితే తల వెయ్యి ముక్కలవుతుందనే మునీశ్వరుడి శాపం చంద్రబాబుకు ఉందని దివంగత వైయస్ పదే పదే చెప్పేవారన్నారు. అందుకే బాబు ఒక్క నిజమూ చెప్పరన్నారు. వైయస్ హయాంలో వికలాంగులకు రూ.500, మిగతా వారికి రూ.200 చొప్పున మొత్తం 69 లక్షల మందికి పింఛన్లు ఇచ్చారని గుర్తుచేశారు.

తన హయాంలో తీవ్రమైన దుర్భిక్షానికిలోనైన అనంతపురం జిల్లాలో గంజి కేంద్రాలు నడుపుతుంటే వద్దన్న చంద్రబాబు ఇప్పుడు వారి బాగోగులు తెలుసుకుంటానంటూ రావడాన్ని ప్రజలు గమనించాలని విజ్ఞప్తి చేశారు. బాబు ఎన్నడైనా పసిపిల్లలను ఎత్తుకున్నారా, వృద్ధులను కౌగిలించుకున్నారా, మహిళలను దగ్గరకు తీసుకున్నారా అని ప్రశ్నించారు. ఇపుడు తమ పార్టీ దెబ్బకు అవన్నీ చేస్తున్నారన్నారు. జగన్ దెబ్బకు వేలాది కిలోమీటర్లు పాదయాత్ర చేస్తున్నారని, తన శైలినే మార్చి వేసి విక్టరీ సింబల్‌కు బదులు రెండు చేతులు జోడించి ప్రజలకు దండాలు పెడుతున్నారని ఎద్దేవా చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+