వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముందుగానే ఎన్నికలు, మద్దతుపై రేపు: మాయావతి

By Pratap
|
Google Oneindia TeluguNews

Mayawati
లక్నో: లోకసభకు గడువు కన్నా ముందే ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని బిఎస్పీ అధినేత, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతి జోస్యం చెప్పారు. యుపిఎకు మద్దతు కొనసాగించాలా, వద్దా అనే విషయంపై రేపు బుధవారం తుది నిర్ణయం తీసుకుంటామని అన్నారు. లక్నోలో జరిగే జాతీయ కార్యవర్గ సమాువేశంలో యుపిఎకు మద్దతుపై నిర్ణయం తీసుకుంటామని ఆమె చెప్పారు. బిఎస్పీ వ్యవస్థాపకుడు కాన్షీరాం ఆరో వర్ధంతి సందర్భంగా మంగళవారం ఏర్పాటు చేసిన మహాసంకల్ప్ ర్యాలీని ఉద్దేశించి ఆమె ప్రసంగించారు.

లోకసభ ఎన్నికలకు యుద్ధప్రాతిపదికపై సిద్ధం కావాలని ఆమె పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రిటైల్ రంగంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్‌డిఐలను) అనుమతించడానికి తాము వ్యతిరేకమని ఆమె చెప్పారు. ఎఫ్‌డిఐల అనుమతి వల్ల రైతులు, లఘు వ్యాపారాలు తీవ్రంగా దెబ్బ తింటారని అన్నారు. ఇంధన ధరలు పెంచి పేదలపై, సామాన్యులపై భారం వేయడానికి బదులు సంపన్నులపై పన్నులు విధించాల్సిందని ఆమె అన్నారు.

యుపిఎ ప్రభుత్వం దళిత వ్యతిరేక విధానాలను అనుసరిస్తోందని ఆమె విమర్శించారు. కాన్షీరామ్ వర్ధంతి సందర్భంగా ఇచ్చే సెలవును కూడా రద్దు చేసే స్థాయికి సమాజ్‌వాదీ ప్రభుత్వం దిగజారిందని ఆమె విమర్శించారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కక్షపూరిత రాజకీయాలను నడుపుతున్నారని దుయ్యబట్టారు. బాబా సాహెబ్ అంబేడ్కర్, ఇతర దళిత నేతల పేర్ల మీద పథకాల పేర్లను కూడా మార్చేస్తున్నారని అన్నారు.

రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయని మాయావతి విమర్శించారు. హర్యానాలో దిళతులపై నేరాలు పెరగడం పట్ల ఆ రాష్ట్ర ప్రభుత్వంపై ఆమె ధ్వజమెత్తారు. తన ప్రభుత్వ హయాంలో మతఘర్షణలు జరగలేదని, గత ఆరు నెలల ఎస్పీ పాలనలో పది అల్లర్లు చోటు చేసుకున్నాయని ఆమె అన్నారు.

English summary
Bahujan Samaj Party (BSP) chief Mayawati on Tuesday said that her party will take a final call on Wednesday whether to continue its support to the United Progressive Alliance (UPA) government at the Centre or not. The party will take this decision at its national executive meet in Lucknow on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X