హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సోనియా అనుమతి కోసం కిరణ్: డిఎల్‌కు ఉద్వాసనే...

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kiran Kumar Reddy - DL Ravindra Reddy
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మంత్రి వర్గ విస్తరణ కోసం మరోసారి ఢిల్లీ వెళ్లనున్నారని సమాచారం. త్వరలో గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలలో సాధారణ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ త్వరలో ప్రచార పర్వంలో బిజీ కానున్నారు. ఆమె ప్రచారంలో బిజీ కాకముందే ఢిల్లీ వెళ్లి ఆమెను కలిసి మంత్రివర్గంలో మార్పులు, చేర్పుల కోసం అనుమతి తీసుకోవాలని కిరణ్ భావిస్తున్నారని సమాచారం.

ఇందుకోసం ఆయన ఈ నెలఖరులోగా ఎప్పుడైనా ఢిల్లీ వెళ్లవచ్చని చెబుతున్నారు. గత మార్పులు చేర్పుల్లో తనను టార్గెట్‌‍గా చేసుకున్న శంకర రావుకు ఉద్వాసన పలికారు. ఈసారి నిత్యం తన పాలనపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ... అధిష్టానానికి లేఖలపై లేఖలు ఇస్తూ ఫిర్యాదు చేస్తున్న మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డిని మంత్రివర్గం నుండి తొలగించాలని భావిస్తున్నట్లుగా సమాచారం. పార్టీలోని పలువురు సీనియర్ నేతలు కూడా కిరణ్‌కు మంత్రివర్గంపై సూచనలు ఇస్తున్నారట.

సాధారణ ఎన్నికలు మరెంతో దూరం లేనందున మంత్రివర్గంలో మార్పులు చేర్పులు చేసి.. అనుకూలంగా ఉండే వారిని, పార్టీకి లబ్ధి చేకూరుతుందనుకునే వారిని తీసుకోవాలని సూచిస్తున్నారని సమాచారం. ఇటీవలె తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఢిల్లీ వెళ్లి నెల రోజులు అక్కడే మకాం వేశారు. కిరణ్ ఢిల్లీ వెళితే తెలంగాణపై అక్కడ ఏం జరిగిందో కూడా తెలుసుకునే అవకాశం ఉంటుందని పలువురు కిరణ్‌కు సూచిస్తున్నారట.

కిరణ్ కేబినెట్లో పలు శాఖలకు మంత్రులు లేరు. మోపిదేవి వెంకటరమణ జైలుకు వెళ్లగా, విద్యుత్ శాఖ మంత్రి ఎప్పుడో రాజీనామా చేశారు. వీటితో పాటు పలు శాఖలకు మంత్రులు లేరు. ధర్మాన ప్రసాద రాజీనామా ముఖ్యమంత్రి వద్ద పెండింగులో ఉంది. సాధారణ ఎన్నికలు దగ్గరవుతున్న సమయంలో అన్ని శాఖలకు మంత్రులను కేటాయిస్తే బాగుంటుందని పలువురు సూచిస్తున్నారట. మంత్రివర్గంలో మార్పులు చేర్పులు చేయాలని సీనియర్ల నుండి కిరణ్‌కు సూచనలు వచ్చిన నేపథ్యంలో ఆయన సోనియా అనుమతి కోసం ఢిల్లీ వెళ్లనున్నారని అంటున్నారు.

English summary
Chief Minister N. Kiran Kumar Reddy is learnt to be planning a Delhi visit later this month and would meet Congress president Sonia Gandhi before she gets busy in campaigning ahead of Assembly elections in Gujarat and Himachal Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X