వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చిద్దూ, జయంతీ నటరాజన్‌కు మధ్య ఎన్ఐబి చిచ్చు

By Pratap
|
Google Oneindia TeluguNews

Jayanthi Natarajan-P Chidambaram
న్యూఢిల్లీ: యుపిఎలోని ఇద్దరు మంత్రుల మధ్య చిచ్చు రేగింది. కేంద్ర ఆర్థిక మంత్రి పి. చిదంబరం ప్రతిపాదించిన జాతీయ పెట్టుబడుల బోర్డు స్థాపన ఇరువురి మధ్య వివాదానికి కారణమైంది. ఆ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి జయంతీ నటరాజన్ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్‌కు లేఖ రాశారు.

పర్యావరణ మంత్రిత్వ శాఖ ప్రమేయం లేకుండా మెగా ప్రాజెక్టులకు వేగంగా అనుమతి ఇవ్వడానికి చిదంబరం ఆ బోర్డును ప్రతిపాదించారు. భారీ పెట్టుబడుల ఫాస్ట్ ట్రాక్ క్లియరెన్స్ కోసం చిదంబరం ఆ బోర్డును ప్రతిపాదించారు. ఒక్కసారి బోర్డు ప్రాజెక్టుకు అనుమతి ఇచ్చిన తర్వాత దాన్ని అడ్డగించడానికి ఏ మంత్రిత్వ శాఖకు కూడా అధికారం ఉండదు. అటువంటి అధికారాలను బోర్డుకు కట్టబెట్టాలనేది చిదంబరం ప్రతిపాదన

బోర్డు పర్యావరణ మంత్రిత్వ శాఖ అధికారాలను కుదిస్తుందని జయంతీ నటరాజన్ వాదిస్తున్నారు. ఈ ప్రతిపాదన అంగీకారయోగ్యం కాదని, ఏ మంత్రిత్వ శాఖ వైఫల్యాలపై నిర్ణయం చేసే రాజ్యాంగాధికారం ఆ బోర్డుకు ఉండదని ఆమె అంటున్నారుయ

మంత్రిత్వ శాఖలు నడవాల్సిన తీరుపై ఇటువంటి బోర్డులు వ్యతిరేక పరిణామాలకు దారి తీస్తాయని ఆమె విమర్శిస్తున్నారు. పర్యావరణ మంత్రిత్వ శాఖ తీసుకున్న నిర్ణయాన్ని కాదని జాతీయ పెట్టుబడుల బోర్డు వ్యతిరేకిస్తూ ఆమోదం తెలిపితే దానికి పార్లమెంటులో ఎవరు సమాధానం చెప్తారని ఆమె అడిగారు. ఇటువంటి సమస్యలు చాలా వస్తాయని ఆమె అన్నారు.

జాతీయ పెట్టుబడుల బోర్డు (ఎన్ఐబి)పై క్యాబినెట్ నోట్‌ను ఇదివరకే రూపొందించారు. మంత్రులకు పంపిణీ కూడా చేశారు. ఆ బోర్డుకు ఆర్థిక మంత్రి నేతృత్వం వహిస్తారు. పర్యావరణ చట్టాలు, గ్రీన్ క్లియరెన్సెన్స్ ప్రాజెక్టులకు ఆటంకాలుగా మారాయనే ఫిర్యాదులు రావడంతో ఎన్ఐబిని ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ముందుకు వచ్చింది.

English summary
Another tussle between two ministers of the United Progressive Alliance (UPA) government has come to the fore.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X