వీడుతున్న కన్నడ నటి హేమశ్రీ మృతి మిస్టరీ

అనంతపురంలోని ఓ ఫామ్‌హౌస్‌కు చెందిన కాంగ్రెసు నాయకుడి పాత్రపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు ఫామ్‌హౌస్‌కు చెందిన మురళిని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. మురళి, హేమశ్రీ భర్త సురేంద్రబాబు వ్యాపార భాగస్వాములని అంటున్నారు. హేమశ్రీది సహజ మరణం కాదని పోస్టుమార్టం నివేదికలో తేలిందని వార్తలు వచ్చాయి.
ఫామ్‌హౌస్ సిబ్బందిని బెంగళూర్ పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. సురేంద్రబాబు తన నేరాన్ని అంగీకరించినట్లు ప్రచారం జరుగుతున్నప్పటికీ పోలీసులు మాత్రం ధ్రువీకరించడం లేదు. భార్య హేమశ్రీని హైదరాబాదుకు తీసుకుని వస్తూ సురేంద్ర బాబు ఫామ్‌హౌస్‌కు వెళ్లాడు.
హేమశ్రీ కేసులో అనవసరంగా తన పేరును ముందుకు తెస్తున్నారని మురళి ఆవేదన వ్యక్తం చేశారు. తన రాజకీయ మనుగడను ఓర్వలేక తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆయన ఓ టీవీ చానెల్ ప్రతినిధితో అన్నారు. ఫామ్‌హౌస్‌కు రావడానికి ముందే హేమశ్రీ మరణించిందని పోస్టుమార్టంలో తేలినట్లు ఆయన తెలిపారు. పోలీసులు తనను కూడా ప్రశ్నించారని ఆయన చెప్పారు. హేమశ్రీ భర్త సురేంద్రబాబును పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
కర్నాటకకు చెందిన ప్రముఖ టివి నటి హేమశ్రీ(30) అనుమానాస్పద స్థితిలో మరణించింది. అక్టోబర్ 9వ తేదీ రాత్రి పది గంటల సమయంలో తీవ్ర అస్వస్థతగా ఉందంటూ ఆమె తన భర్త ముప్పయ్యేడేళ్ల సుధీంద్ర, ఆమెను కారులో బెంగళూరు నగర శివారులోని బాప్టిస్టు ఆసుపత్రికి తీసుకు వచ్చారు.
అప్పటికే ఆమె మరణించినట్లుగా బాప్టిస్టు ఆసుపత్రి వైద్యులు నిర్ధారించారు. సుధీంద్ర పోలీసులుకు తెలిపిన వివరాల మేరకు.. చెన్నైలోని తమిళ సీరియల్ షూటింగు ముగించుకొని హేమశ్రీ బెంగళూరుకు చేరుకున్నారు. మరో కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇద్దరూ కారులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాకు బయలుదేరారు. మార్గమధ్యంలో ఆమె అస్వస్థతకు గురి కావడంతో ఆస్పత్రికి భర్త తీసుకుని వెళ్లినట్లు వార్తలు వచ్చాయి.
-
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
అన్నదాత సుఖీభవ నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే మీ ఖాతాల్లో..!! -
పేక మేడలా కుప్పకూలుతున్న బంగారం ధరలు -
ప్రపంచంలోనే చీపెస్ట్ కంట్రీ.. హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి..? -
వాషింగ్టన్ ఎయిర్ పోర్టుల్లో అనూహ్య పరిణామం: యుద్ధ భయాల మధ్య.. !! -
ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం బంపరాఫర్- వంద శాతం సబ్సిడీతో కొత్తగా.. మార్గదర్శకాలు..!!












Click it and Unblock the Notifications