హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

షర్మిల ప్రస్థానం: తల్లి చాటు బిడ్డ నుంచి...

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తల్లి చాటు బిడ్డగా మొదలైన షర్మిల రాజకీయ ప్రస్థానం తెర ముందుకు వచ్చే దాకా సాగింది. తన సోదరుడు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళ్లిన నేపథ్యంలో అమ్మకు తోడునీడగా ఉండాలని ఆమె భావించి వైయస్ విజయమ్మ వెంట నడవడానికి షర్మిల సిద్ధపడ్డారు. జగన్‌ జైలుకు వెళ్లిన నేపథ్యంలో వైయస్ విజయమ్మపై పార్టీని ముందుకు నడిపించే బాధ్యత పడింది.

షర్మిల: తల్లి చాటు బిడ్డ నుంచి...

జైలులో జగన్‌ను కలిసినప్పుడు కూడా వైయస్ విజయమ్మ, వైయస్ జగన్ భార్య భారతి ముందు వరుసలో ఉంటే తల్లి వెనక షర్మిల కనిపించారు. సహాయం అందించడానికి మాత్రమే అన్నట్లుగా షర్మిల తెర మీద కనిపించారు.

షర్మిల: తల్లి చాటు బిడ్డ నుంచి...

జగన్‌ను అరెస్టు చేసిననాడు తల్లితో పాటు నిరసన వ్యక్తం చేశారు. వైయస్ జగన్‌ను అరెస్టు చేసినప్పుడు కుటుంబ సభ్యులు నిరసన వ్యక్తం చేసిన సమయంలో తల్లి వెనక మాత్రమే షర్మిల ఉన్నారు.

షర్మిల: తల్లి చాటు బిడ్డ నుంచి...

ఉప ఎన్నికల ప్రచారంలో షర్మిల ద్వితీయ పాత్ర పోషించడానికి పూనుకున్నారు. నేను మహానేత వైయస్ రాజశేఖర రెడ్డి కూతురును, వైయస్ జగన్ సోదరిని అంటూ తనను తాను పరిచయం చేసుకుంటూ ఎన్నికల ప్రచార ప్రసంగాలు ప్రజలను ఆకర్షించడం ప్రారంభించాయి. ఉప ఎన్నికల ప్రచారంలో షర్మిల ప్రతిపక్షాల టార్గెట్‌గా మారారు.

షర్మిల: తల్లి చాటు బిడ్డ నుంచి...

ఉప ఎన్నికల ప్రచారంలో ప్రధాన ప్రచార సారథి విజయమ్మ అయ్యారు. ఆమె ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న సమయంలో షర్మిల ఆమెను అనుసరించారు. అయితే, తల్లి విజయమ్మ ప్రసంగాలు చేసే విషయంలో తడబడుతుంటే షర్మిల కూడా మైక్ అందుకున్నారు.

షర్మిల: తల్లి చాటు బిడ్డ నుంచి...

షర్మిల వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో ముందుకు వస్తున్న తీరుతో వైయస్ జగన్ భార్య భారతి నొచ్చుకున్నట్లు అప్పట్లో ప్రచారం సాగింది. దాంతో ఆమె తెర వెనక్కి వెళ్లిపోవడానికి సిద్ధపడినట్లు చెబుతారు. అయితే, భారతి సంస్థల వ్యవహారాలు, కేసుల వ్యవహారాలు చూసుకోవాల్సి రావడంతో షర్మిల ముందుకు రాక తప్పని పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు.

షర్మిల: తల్లి చాటు బిడ్డ నుంచి...

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సుదీర్ఘ పాదయాత్ర చేపట్టడంతో దానికి కౌంటర్‌ ఇవ్వాల్సిన పరిస్థితిలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పడింది. దీంతో చంద్రబాబు పాదయాత్రను బీట్ చేసేందుకు షర్మిల ముందుకు వచ్చారు. విజయమ్మ ప్రసంగాలు చేసే విషయంలో తడబడుతుంటే షర్మిల కూడా మైక్ అందుకున్నారు.

ముందు వేసుకున్న పథకం ప్రకారమే పార్టీకి సంబంధించి ప్రధాన పాత్రలోకి వైయస్ విజయమ్మ ప్రవేశించారు. అయితే, ఆమెకు తోడుగా వెనక నడవడానికి షర్మిల సిద్ధపడ్డారు. జగన్‌ను అరెస్టు చేసిననాడు తల్లితో పాటు నిరసన వ్యక్తం చేశారు. వైయస్ జగన్‌ను అరెస్టు చేసినప్పుడు కుటుంబ సభ్యులు నిరసన వ్యక్తం చేసిన సమయంలో తల్లి వెనక మాత్రమే షర్మిల ఉన్నారు.

జైలులో జగన్‌ను కలిసినప్పుడు కూడా వైయస్ విజయమ్మ, వైయస్ జగన్ భార్య భారతి ముందు వరుసలో ఉంటే తల్లి వెనక షర్మిల కనిపించారు. సహాయం అందించడానికి మాత్రమే అన్నట్లుగా షర్మిల తెర మీద కనిపించారు. ఉప ఎన్నికల ప్రచారంలో ప్రధాన ప్రచార సారథి విజయమ్మ అయ్యారు. ఆమె ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న సమయంలో షర్మిల ఆమెను అనుసరించారు. అయితే, తల్లి విజయమ్మ ప్రసంగాలు చేసే విషయంలో తడబడుతుంటే షర్మిల కూడా మైక్ అందుకున్నారు.

ఉప ఎన్నికల ప్రచారంలో షర్మిల ద్వితీయ పాత్ర పోషించడానికి పూనుకున్నారు. నేను మహానేత వైయస్ రాజశేఖర రెడ్డి కూతురును, వైయస్ జగన్ సోదరిని అంటూ తనను తాను పరిచయం చేసుకుంటూ ఎన్నికల ప్రచార ప్రసంగాలు ప్రజలను ఆకర్షించడం ప్రారంభించాయి. ఉప ఎన్నికల ప్రచారంలో షర్మిల ప్రతిపక్షాల టార్గెట్‌గా మారారు.

షర్మిల వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో ముందుకు వస్తున్న తీరుతో వైయస్ జగన్ భార్య భారతి నొచ్చుకున్నట్లు అప్పట్లో ప్రచారం సాగింది. దాంతో ఆమె తెర వెనక్కి వెళ్లిపోవడానికి సిద్ధపడినట్లు చెబుతారు. అయితే, భారతి సంస్థల వ్యవహారాలు, కేసుల వ్యవహారాలు చూసుకోవాల్సి రావడంతో షర్మిల ముందుకు రాక తప్పని పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు.

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సుదీర్ఘ పాదయాత్ర చేపట్టడంతో దానికి కౌంటర్‌ ఇవ్వాల్సిన పరిస్థితిలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పడింది. దీంతో చంద్రబాబు పాదయాత్రను బీట్ చేసేందుకు షర్మిల ముందుకు వచ్చారు. ఎంత దూరమైన నడుస్తానంటూ తనంత తానుగా పాదయాత్రకు సిద్ధపడ్డారు. దీంతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుల్లో ఉత్సాహం పెరిగింది. అందుకు జగన్ పచ్చ జెండా ఊపక తప్పలేదు. ఏమైనా, తల్లి చాటు బిడ్డగా మొదలైన షర్మిల రాజకీయ జీవితం తెర ముందుకు వచ్చింది. ఎంత దూరం పోతుందో చూడాలి.

English summary
YSR Congress president YS Jagan's sister Sharmila political yatra has begin to extend assistance to her mother YS Vijayamma. Today she is playing lead role in YSR Congress.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X