వస్తే చూస్తా: ఖుర్షీద్ బెదిరింపు: కేజ్రీవాల్ ధీటు స్పందన

ఆ తర్వాత తన అన్ పార్లమెంటరీ వ్యాఖ్యలపై వెనక్కి తగ్గారు. తాను కేవలం సందర్భానుసారం మాత్రమే అలా మాట్లాడానని చెప్పారు. మాజీ స్పీకర్ సోమనాథ్ ఛటర్జీ తదితరులు ఖుర్షీద్ వ్యాఖ్యలను తప్పు పట్టారు. ఖుర్షీద్ వ్యాఖ్యలు చాలా విచారకరమన్నారు. కాగా ఖుర్షీద్ వ్యాఖ్యలకు అరవింద్ కేజ్రీవాల్ కూడా ఘాటైన సమాధానమే ఇచ్చారు. ఇతను తన ట్విట్టర్‌లో సల్మాన్ ఖుర్షీద్ వ్యాఖ్యలపై స్పందించారు.
ఖుర్షీద్ తనను బెదిరింపులకు గురి చేస్తున్నారని, న్యాయశాఖ మంత్రిగా ఉన్న సల్మాన్ ఖుర్షీద్ మాట్లాడాల్సిన మాటలు కావని, అవి ఆయనకు సరిపోవని, తనను చంపితే దేశానికి ఎలాంటి నష్టం లేదన్నారు. అదే జరిగితే దేశం జాగృతమవుతుందన్నారు. వందల కొద్ది కేజ్రీవాల్‌లు పుట్టుకు వస్తారని, తనను బెదిరించే బదులు అధికారంలో ఉన్న కాంగ్రెసు పార్టీ అవినీతికి వ్యతిరేకంగా చర్యలు తీసుకుంటే బాగుంటుందని ఆయన సూచించారు.
కాగా కేజ్రీవాల్ ఈ రోజు మరో నేత అవినీతి చిట్టా విప్పుతానని చెప్పిన విషయం తెలిసిందే. అరవింద్ కేజ్రీవాల్ తాజాగా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు నితిన్ గడ్కరీ అవినీతి గురించి చెప్పే అవకాశముందని తెలుస్తోంది. కేజ్రీవాల్ ఎవరి గురించి చెబుతారో అనే అంశం హాట్ టాపిక్‌గా మారింది.












Click it and Unblock the Notifications