వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రిషికొండలో గీతం విషాదం: నాలుగుమృతదేహాలు లభ్యం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Three dead bodies found at rishikonda valley
విశాఖపట్నం: రిషికొండ బీచ్‌లో గల్లంతైన ఆరుగురు గీతం విశ్వవిద్యాలయం విద్యార్థులలో గురువారం మధ్యాహ్నానికి నాలుగు మృతదేహాలను వెలికితీశారు. మిగిలిన రెండు మృతదేహాల కోసం నావీ, మెరైన్ హెలికాప్టర్ దళాలు గాలింపు చర్యలు చేస్తున్నాయి. గజ ఈతగాళ్లు కూడా వెతుకుతున్నారు. నిరంతరం గాలిస్తున్నప్పటికీ ఆరు మృతదేహాలు లభించలేదు. కోస్ట్ గార్డ్ హెలికాప్టర్ రంగంలోకి దిగింది.

గాలింపు చర్యల్లో దొరికిన నాలుగింటిలో మూడు మృతదేహాలు ప్రీతి రెడ్డి, అనూష, భూపతి సుశీల్‌విగా గుర్తించారు. ప్రీతి, అనూషల మృతదేహాలు మధ్యాహ్నం దొరకగా, భూపతిది ఉదయం దొరికింది. వీటిని పోస్టుమార్టం నిమిత్తం కెజిహెచ్‌కు తరలించారు. మిగిలిన మూడు మృతదేహాల కోసం గాలిస్తున్నారు. ఆరు కుటుంబాలలో విషాదఛాయలు నెలకొన్నాయి. కుటుంబ సభ్యులు అక్కడకు వచ్చి తమ పిల్లల కోసం రోదిస్తున్నారు.

కాగా ఆరుగురు ఇంజనీరింగ్ విద్యార్థులు గల్లంతైన సంఘటన బుధవారం విషాదాన్ని నింపిన విషయం తెలిసిందే. విశాఖ జిల్లా గీతం విశ్వవిద్యాలయానికి చెందిన ఏడుగురు విద్యార్థులు రిషికొండ బీచ్‌కు బుధవారం మధ్యాహ్నం ఈత కోసం వెళ్లారు. వారు ఈత కొడుతున్న సమయంలో ఒక్కసారిగా అలల ఉధృతి పెరగడంతో వారు గల్లంతయ్యారు. దీనిని గమనించిన మత్సకారులు, గజ ఈతగాళ్లు వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

వారు రాహుల్ బాబు అనే విద్యార్థిని నిన్ననే రక్షించారు. ఆరుగురు విద్యార్థుల కోసం నిన్నటి నుండే గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైన ఆరుగురిలో ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు. వారి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు చెబుతున్నారు. సాయి ప్రియా రిసార్ట్ సమీపంలో వారు గల్లంతయ్యారు. గల్లంతైన విద్యార్థులు అందరూ తెలంగాణ ప్రాంతానికి చెందిన వారే. అందరూ మొదటి సంవత్సరం విద్యార్థులే కావడం విషాదకరం. సింధు హైదరాబాద్, అనుష నల్గొండ, సాయి నితిన్ హైదరాబాద్, సుశీల్ వరంగల్, అనురాగ్ కరీంనగర్, ప్రీతి కరీంనగర్‌లకు చెందిన వారిగా గుర్తించారు.

English summary
Three students dead bodies of Geetham University were found on Thursday at Rishikonda valley. Marine Helicopter is searching for other three bodies.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X