వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేజ్రీవాల్‌కు వాస్తవాలు తెలియవు: గడ్కరీ, నేతల అండ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Nitin Gadkari
న్యూఢిల్లీ: తనపై అవినీతి ఆరోపణలు చేసిన అరవింద్ కేజ్రీవాల్‌కు వాస్తవాలు తెలియవని భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ గడ్కరీ బుధవారం రాత్రి అన్నారు. గడ్కరీ పైన కేజ్రీవాల్ బుధవారం తీవ్ర అవినీతి ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై నితిన్ స్పందించారు. కేజ్రీవాల్ ఆరోపణలను తాను ఖండిస్తున్నానని, ఇది సరికాదన్నారు. మహారాష్ట్రలో నిబంధనలకు విరుద్ధంగా తాను ఎలాంటి భూములు పొందలేదన్నారు.

ఇచ్చిన ఆ భూమిని చారిటబుల్ ట్రస్టుకు లీజుగా ఇచ్చారని, అది సహకార సంస్థ లాంటిదని, తన సొంత సంస్థ కాదని, అలాగే వ్యవసాయ భూమి అనడమూ అబద్దమే అన్నారు. బంజరు భూమి అని, దాని విలువ రూ.20 లక్షలు మించదన్నారు. ఒక ప్రాజెక్టు నీటిని పూర్తిగా పరిశ్రమలకే వాడుతున్నామన్న ఆరోపణలనూ ఖండించారు. అందులో 0.85 శాతం నీటిని మాత్రమే తమ విద్యుత్ ప్లాంటుకు కేటాయించారన్నారు.

మిగిలినదంతా పొలాలకే వెళ్తుందని చెప్పారు. బాధితుల పేరిట కేజ్రీవాల్ ఒకే ఒక్క రైతు పేరు చెప్పారని, ఆయన సొంత పొలంలో చక్కగా వ్యవసాయం చేసుకుంటున్నాడని తెలిపారు. నిజానికి పవర్‌ప్లాంట్ తన చక్కెర కర్మాగారం ఆవరణలోనే ఉందన్నారు. కేజ్రీవాల్ ఎప్పుడూ అక్కడికి వెళ్లలేదని, క్షేత్రస్థాయిలో వాస్తవాలు ఆయనకు తెలియవని అన్నారు. తాను తన ప్రాంత రైతుల క్షేమం కోసం పోరాడుతున్నానన్నారు.

బిజెపి నేతలు సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీ గడ్కరీకి అండగా నిలిచారు. ఈ మేరకు కేజ్రీవాల్ ఆరోపణలను ఖండించారు. పెద్ద బాంబు పేల్చుతామంటూ మీడియా సమావేశం పెట్టారు. చివరికి కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు ఏమీలేనిదాన్ని స్కామ్‌గా చూపి సెల్ఫ్‌గోల్ చేసుకున్నారని ఎద్దేవా చేశారు.

రాజీనామా చేయాలి: కాంగ్రెస్
కేజ్రీవాల్ ఆరోపణలకు గడ్కరీ జవాబివ్వాలని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రషీద్ అల్వీ డిమాండ్ చేశారు. ఆరోపణలపై జాతికి వివరణ ఇచ్చేందుకు బిజెపికి అవకాశం ఇస్తున్నామని, అందు కోసం ఎదురు చూస్తామన్నారు. కేజ్రీవాల్ కాంగ్రెస్‌పై ఆరోపణలు చేసినప్పుడల్లా తమపై విరుచు కుపడే బిజెపియే ఇప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటున్నదన్నారు.

English summary
BJP national president Nitin Gadkari condemned Arvind Kerjiwal's allegations against him.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X