జగన్‌పై టిడిపి కొత్త అస్త్రం: జైళ్లో సకల సౌకర్యాలని లేఖ

అందులో అక్రమాస్తుల కేసులో అరెస్టై చంచల్‌గూడ జైలులో ఉన్న వైయస్ జగన్ సకల సౌకర్యాలు అనుభవిస్తున్నారని పేర్కొన్నారు. జగన్ జైలులో నిబంధనలకు విరుద్ధంగా సెల్‌ఫోన్‌లు ఉపయోగిస్తున్నారని, ములాకత్‌ల పేరుతో జైలులోనే పార్టీ నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నారని, మిగిలిన ఖైదీలకు భిన్నంగా సకల భోగాలు అనుభవిస్తున్నారని లేఖ రాశారు.
కాగా ఈ సంవత్సరం మే 27వ తేదిన వైయస్ జగన్మోహన్ రెడ్డిని సిబిఐ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆయన అప్పటి నుండి చంచల్‌గూడ జైలులోనే ఉన్నారు. పలుమార్లు బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకున్నప్పటికీ ఆయనకు కోర్టులలో చుక్కెదురయింది. ఇటీవల సుప్రీం కోర్టులో పిటిషన్ వేసినప్పటికీ అక్కడా అతనికి షాక్ తగిలింది.
సోనియాపై బొజ్జల ఫైర్
ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ కేంద్రమంత్రి వర్గంలోనే అవినీతిపరులు ఉన్నప్పటికీ స్పందించడం లేదని టిడిపి నేత బొజ్జల గోపాలకృష్ణ రెడ్డి ఆరోపించారు. కేంద్ర కేబినెట్లో అవినీతిమంత్రులు ఉన్నప్పటికీ సోనియా అవినితిపై మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. స్వయంగా సోనియా గాంధీయే ఓ అవినీతి రాణి అని నిప్పులు చెరిగారు.












Click it and Unblock the Notifications