జగన్ కేసు: సిబిఐ జెడితో ఐటి ఆఫీసర్ భేటీ, దూకుడేనా

వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసుకు సంబంధించి సిబిఐ నాలుగు ఛార్జీషీట్‌లను కోర్టుకు ఇప్పటి వరకు సమర్పించిన విషయం తెలిసిందే. సిబిఐ జగన్ కేసుకు సంబంధించి ఒక్కో కేసుకు ఒక్కో ఛార్జీషీటును కోర్టుకు సమర్పించింది. అయితే ఇక అన్ని కలిపి ఒకే ఛార్జీషీట్ వేయాల్సి ఉంది. ఇటీవల భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు సిబిఐకి ఒకే ఛార్జీషీట్ వేయాలని ఆదేశాలు జారీ చేసింది.
దీంతో సిబిఐ జగన్ ఆస్తుల కేసులో పలువురిని విచారించి ఒకే ఛార్జీషీట్ ఆఖరున వేసే అవకాశముంది. జగన్మోహన్ రెడ్డి బెయిల్ కోసం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసుకున్నప్పుడు కోర్టు సిబికి పలు సూచనలు చేసింది. ఒకే ఛార్జీషీట్ దాఖలు చేయాలని, పదే పదే కోర్టుకు సమర్పించవద్దని, అలాగే కేసును మార్చి 31లోగా పూర్తి చేయాలని ఆదేశించింది.












Click it and Unblock the Notifications