పరువు నష్టం కేసులో విశాఖ కోర్టుకు రామోజీ రావు

తన తండ్రిపై భూకుంభకోణం విషయంలో అవాస్తవాలు, సంబంధం లేని ఆరోపణలు చేశారని భూసేకరణాధికారి జనార్ధన్ రావు తనయుడు చంద్రశేఖర్.. రామోజీపై కేసు వేశారు. తన తండ్రిపై రామోజీ రావు తన పత్రిక ఈనాడు పత్రికలో అవాస్తవ ఆరోపణలు చేశారని చంద్రశేఖర్ పేర్కొన్నారు.
ఈ పరువు నష్టం దావాపై కోర్టుకు హాజరైన రామోజీ రావు న్యాయమూర్తి అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం చెప్పారు. కేసులో ఫిర్యాదుదారుడు చేసిన ఆరోపణలు అబద్దమని చెప్పారు. ఇరువైపుల వాదనలు విన్న న్యాయమూర్తి కేసు విచారణనను వచ్చే నెల 15వ తేదికి వాయిదా వేశారు.












Click it and Unblock the Notifications