బాబుకు శాపం, నిజం చెప్తే తల ముక్కలు: షర్మిల

చంద్రబాబు చాలా కష్టపడుతున్నారని, ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకోవాలని జిమ్మిక్కులు చేస్తున్నారని, కానీ ప్రజలు చంద్రబాబును నమ్మడం లేదని, చంద్రబాబు మనస్తత్వం రాష్ట్ర ప్రజలకు పూర్తిగా తెలిసిపోయిందని అన్నారు. కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు కలిసి నీచ రాజకీయాలకు పాల్పడుతున్నాయని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఎన్నికల్లో కలిసి పోటీ చేశాయని, చేతులో చేయి వేసుకుని జగన్ మీద కేసులు బనాయించాయని షర్మిల అన్నారు. కాంగ్రెసుకు, చంద్రబాబు లక్ష్యం ఒక్కటేనని, ఒప్పందం ఒక్కటేనని, చంద్రబాబు ఈ ప్రభుత్వాన్ని కూల్చకూడదు... చంద్రబాబుపై కేసులు ఉండకూడదు అనేది ఆ ఒప్పందమని, మూడో పార్టీని రాష్ట్రంలో లేకుండా చేయడం లక్ష్యమని అన్నారు.
చంద్రబాబుకు పాదయాత్ర చేయాల్సిన అవసరం లేదని, తమ బోటివారికి ఉందని, ప్రభుత్వాన్ని కూల్చే అవకాశం ఉండి కూడా అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించకుండా చంద్రబాబు పాదయాత్ర చేస్తున్నారని, కాంగ్రెసు, చంద్రబాబు నీచ రాజకీయాలకు వ్యతిరేకంగా తాను పాదయాత్ర చేస్తున్నానని ఆమె అన్నారు. జగన్ మీద కేసులు పెట్టడానికి కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు సిబిఐని వాడుకుంటున్నాయని ఆమె విమర్శించారు.
చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఎనిమిది సార్లు కరెంట్ చార్జీలు పెరిగాయని, విద్యుత్ చార్జీలకు వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమిస్తే పోలీసులతో కాల్చి చంపించారని ఆమె అన్నారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో తట్టుకోలేక, అవమానాలకు గురై 4 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, ఇంత పెద్ద యెత్తున రైతులు ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు ప్రపంచంలో ఎక్కడా లేవని అన్నారు. జగనన్న గురించి తాను చెప్పాల్సిన అవసరం లేదని, ప్రజలతో మమేకమయ్యాడని, ప్రజా సమస్యలపై స్పందించారని ఆమె అన్నారు. దేవుడున్నాడని, మంచివారికి దేవుడు మేలు చేస్తాడని, అందువల్ల జగన్ మన మధ్యకు వస్తారని, రాజన్న రాజ్యం తెస్తారని ఆమె అన్నారు.
ఈ సభలో షర్మిల తల్లి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ కూడా మాట్లాడారు. ఆరోగ్యశ్రీ అనారోగ్యశ్రీగా మారిందని అన్నారు. చేనేతను వైయస్ రాజశేఖర రెడ్డి ఆదుకున్నారని, వారానికి ఒక రోజు చేనేత వస్త్రాలు ధరించాలని చెప్పారని, చేనేత కార్మికుల కోసం జగన్ కూడా దీక్ష చేశాడని, నేతన్నలను ఆదుకోవడంపై చంద్రబాబు ఎగతాళి చేశారని ఆమె అన్నారు. ఈ ప్రభుత్వానికి ఒక్క రోజు కూడా పాలించే అర్హత లేదని ఆమె అన్నారు. రెండు రూపాయలకు కిలో బియ్యాన్ని చంద్రబాబు ఐదు రూపాయలకు పెంచారని ఆమె గుర్తు చేశారు.












Click it and Unblock the Notifications