వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సర్వే ఫలితాలు: మూడోసారీ నరేంద్ర మోడీ ముచ్చటే

By Pratap
|
Google Oneindia TeluguNews

Narendra Modi
గాంధీనగర్: గుజరాత్‌లో వరుసగా మూడో సారి కూడా నరేంద్ర మోడీయే అధికారంలోకి వస్తారని ఓ సర్వే ఫలితాలు తెలియజేస్తున్నాయి. తిరిగి ఆయనే ముఖ్యమంత్రి అవుతారని ఆ ఫలితాలు స్పష్టం చేశాయి. నిజాయితీ, అభివృద్ధి నినాదాలను ప్రధాన ఆయుధాలుగా చేసుకున్న మోడీకే గుజరాతీలు మరోసారి పట్టం కడతారని ఇండియాటుడే - ఓఆర్‌జీ సర్వే చెబుతోంది.

2007లో జరిగిన ఎన్నికల్లో బీజేపీకి 117 సీట్లు మాత్రమే రాగా, ఈసారి 128 సీట్లు రావడం ఖాయమని సర్వే తెలిపింది. అదే సమయంలో కాంగ్రెస్‌కు మాత్రం గత ఎన్నికల కంటే 11 సీట్లు తక్కువగా 48 మాత్రమే వస్తాయని సర్వే తెలియజేస్తోంది. రాష్ట్రంలో అభివృద్ధిని చూసే తాము ఓట్లు వేస్తున్నట్లు 60 శాతం మంది చెప్పారు. గుజరాత్‌లో పారిశ్రామికాభివృద్ధి వల్ల ఉద్యోగావకాశాలు పెరిగినట్లు దాదాపు 67 శాతం మంది తెలిపారు.

అయితే ముస్లింలలో 61 శాతం మంది తాము ఆయనకు ఓటు వేసేది లేదని చెప్పినట్లు సర్వే తెలిపింది. గుజరాత్ అల్లర్లకు మోడీ కారకుడు కాడని పోలింగ్‌లో పాల్గొన్నవారిలో 58 శాతం మంది చెప్పారు. అలాగే, మోడీ తమ పట్ల న్యాయంగానే వ్యవహరిస్తున్నారని ముస్లిం ఓటర్లలో 54 శాతం మంది అన్నారు. మోడీ చేజారే మైనారిటీ ఓట్లను కాంగ్రెస్ చేజిక్కించుకునే అవకాశాలున్నాయని సర్వే అభిప్రాయపడింది.

మైనారిటీలను రక్షించేది కాంగ్రెసేనని 43% మంది చెప్పగా, 41% మంది కాదన్నారు. ప్రధాని అయ్యేందుకు బీజేపీలో మోడీకి అర్హత ఉందని 56% మంది, సుష్మా స్వరాజ్‌కు 9% మంది ఓట్లు వేశారు. వేరుకుంపటి పెట్టుకున్న బిజెపి మాజీ నేత కేశూభాయ్ పటేల్ ప్రభావం పెద్దగా కనిపించడంలేదు. పటేల్ ఓటర్లలోనే 77% మంది ఆయనకు ఓటు వేసే ఉద్దేశంలో లేరు. పటేళ్లలో 72 శాతం మంది మోడీకే ఓట్లు వేస్తామని స్పష్టం చేస్తున్నారు.

English summary
According to Indiatoday - ORG survey - Narendra Modi will win in Gujarat assembly election. He will become a chief minister for third time.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X