కావూరి అలక: లాస్ట్‌టైంలో పురంధేశ్వరి ప్రమోషన్‌కు బ్రేక్

ఆమె సామర్థ్యాన్ని గుర్తించిన అధిష్టానం కేంద్రమంత్రి పదవి ఇచ్చేందుకు సిద్ధపడింది. అదే సమయంలో ఆ సామాజిక వర్గాన్ని కూడా ఆకర్షించవచ్చునని భావించింది. అయితే కావూరి సాంబశివ రావు అలక పురంధేశ్వరి ప్రమోషన్‌కు బ్రేక్ వేసిందని అంటున్నారు. పార్టీలో ప్రాధాన్యత ఉన్న పదవిని కట్టబెట్టడమే కాకుండా పురంధేశ్వరిని సహాయమంత్రిగానే ఉంచితే కావూరి చల్లబడతారని గుర్తించిన అధిష్టానం ఆమె ప్రమోషన్‌పై చివరి నిమిషంలో వెనక్కి తగ్గినట్లుగా తెలుస్తోంది.
మానవ వనరుల శాఖామంత్రిగా ఉన్న ఆమెకు కొత్తగా వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయమంత్రి బాధ్యతలు అప్పగించారు. పురంధేశ్వరికి ప్రమోషన్ వస్తుందనే ఉత్సాహంతో ఉన్న ఆమె వర్గంలో కావూరి అలక పెద్ద జర్క్ తీసుకు వచ్చింది. ఆమెకు ప్రమోషన్ రాకపోవడంతో ఆమె వర్గం ఒక్కసారిగా నిరుత్సాంలో పడిపోయారు. ఆశలు రేపి చివరి నిమిషంలో ప్రమోషన్ దక్కక పోవడంతో పురంధేశ్వరి కూడా స్తబ్దుగానే ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే ఇది అధిష్టానం నిర్ణయం కాకపోవడంతో పాటు ఒత్తిడి వల్ల ఇలా జరగడంతో ఆమె ఢిల్లీ పెద్దల పట్ల సానుకూలంగానే ఉన్నారని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications