షర్మిల సీరియస్ కాదు, బాబుకు పిచ్చి: తులసిరెడ్డి

చంద్రబాబుకు సంతకాలు పిచ్చి పట్టిందని ఆయన వ్యాఖ్యానించారు. తాను అధికారంలోకి వస్తే తొలి సంతకం, మలి సంతకం, మూడో సంతకం అంటూ హామీలు ఇస్తున్నారని ఆయన అన్నారు. చంద్రబాబు ఏయే ఫైళ్లపై వరుసగా ఆ మూడు సంతకాలు చేస్తానని చెప్పారో వాటిని ఆయన గుర్తు చేశారు. బీసీలపై మక్కువ ఉంటే చంద్రబాబు పార్టీ అధ్యక్ష పదవిని బీసీ నేతకు ఇవ్వాలని ఆయన అన్నారు.
తమ పార్టీ బొత్స సత్యనారాయణకు పిసిసి అధ్యక్ష పదవిని ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. వంద హామీలు ఇచ్చినా చంద్రబాబు అధికారంలోకి రావడం కల్ల అని ఆయన అన్నారు. చంద్రబాబును ప్రజలు విశ్వసించడం లేదని ఆయన అన్నారు. పడమట సూర్యుడు ఉదయించడం ఎంత అసంభవమో, చంద్రబాబు అధికారంలోకి రావడం అంతే అసంభవమని ఆయన అన్నారు.
రెడ్డి సామాజిక వర్గానికి కేంద్ర మంత్రి వర్గంలో అన్యాయం జరిగిందనే మాటలో నిజం లేదని కాంగ్రెసు సీనియర్ శానససభ్యుడు, మాజీ మంత్రి జెసి దివాకర్ రెడ్డి అన్నారు. ఇప్పటికే జైపాల్ రెడ్డి మంత్రివర్గంలో ఉండగా, కోట్ల సూర్యప్రకాష్ రెడ్డిని కొత్తగా తీసుకోవడం సంతోషించదగిన విషయమని ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. కావూరి సాంబశివ రావుకు మంత్రి పదవి ఇచ్చి ఉంటే బాగుండేదని అన్నారు.












Click it and Unblock the Notifications