Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

స్పానిష్ గర్ల్ రేప్: దొంగ అరెస్ట్, యాక్టర్ ఇంట్లోనూ చోరీ

Burglar who raped Spaniard was out on bail, is arrested
ముంబై: స్పానిష్ దేశానికి చెందిన యువతిని రెండుసార్లు రేప్ చేసిన ఘటనలో నిందితుడిని పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. అతడు గత వారం డినో మారియాలో యాక్టర్ ఇంట్లో దొంగతనం చేసి పోలీసులకు పట్టుబడ్డాడు. అ తర్వాత బెయిల్ పైన బయటకు వచ్చాడు. ఆ తర్వాతనే సంగీతం నేర్చుకునేందుకు భారత్‌కు వచ్చిన స్పానిష్ యువతిపై రెండుసార్లు అత్యాచారం చేశాడు.

28 ఏళ్ల అన్వర్ మొహమ్మద్ అన్సారీ అనే ఈ నిందితుడిపై ఐదారు కేసులో ఉన్నాయి. అన్సారీ రే రోడ్‌లోని స్లమ్ ఏరియాలో తన భార్య, తల్లిదండ్రులు, పిల్లలతో కలిసి నివసిస్తున్నాడు. ఇతన్ని స్థానికంగా పలువురు చోర్ బాద్షా అని అంటారు. 2008లో ఇతను చైనీస్‌కు చెందిన ఓ యువతిని లైంగిక వేధింపులకు గురి చేయడమే కాకుండా.. ఆమె ఇంట్లో చోరీ చేసినట్లుగా పోలీసులు చెబుతున్నారు.

కాగా నిందితుడు తన ఇంట్లోకి వచ్చి తనను డబ్బులు, బంగారం అడిగాడని, ఆ తర్వాత తనపై దాడి చేశాడని బాధిత స్పానిష్ దేశ యువతి తెలిపింది. నిద్రలో ఉన్న తాను ఏదో శబ్ధం వచ్చి లేచానని, తన ఎదురుగా ఉన్న వ్యక్తిని చూసి షాక్‌కు గురయ్యానని, అతని చేతిలో కత్తి ఉందని ఆమె తెలిపింది. తనను మొదట బంగారం కోసం డిమాండ్ చేసిన నిందితుడు ఆ తర్వాత బలవంతం చేశాడని తెలిపింది.

కాగా ఓ దోపిడీ దొంగ స్పానిష్ దేశానికి చెందిన ఓ యువతిని ముంబైలో అత్యాచారం చేసి, ఆమె దగ్గర ఉన్న డబ్బును, నగలను దోచుకున్న విషయం తెలిసిందే. ముంబైలోని పోష్ ప్రాంతమైన బాంద్రాలో ఈ ఘటన జరిగింది. ముంబై పోలీసులు దీనికి సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నిందితుడి స్కెచ్ గీసి అతనిని పట్టుకునేందుకు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న పోలీసు స్టేషన్లకు దానిని పంపించారు.

27 ఏళ్ల స్పానిష్ యువతి సంగీతాన్ని నేర్చుకునేందుకు ముంబై వచ్చింది. ఆమె సంగీతం ప్రయివేట్ క్లాసులు కూడా తీసుకుంటోంది. ఈమె సోమవారం రోజు తన ఫ్లాట్‌లో ఒంటరిగా ఉంది. తనతో పాటు కలిసి ఉండే మరో యువతి బయటకు వెళ్లింది. మధ్యాహ్నం రెండు గంటల సమయంలో పెర్రీ క్రాస్ రోడ్డులోని బంగ్లాలోకి వచ్చాడు. అయితే పని మనుషులు చూడటంతో అతను ఎక్కడి నుండి పారిపోయాడు.

ఆ తర్వాత అతను అదే బంగ్లాకు అనుసంధానించబడి ఉన్న బంగ్లాలోకి వెళ్లాడు. ఇతను ఓ సీనియర్ సిటిజన్ ఇంట్లో రాబరీ చేశాడు. ఆ తర్వాత స్పానిష్ యువతి బంగ్లాలోకి ఎంటర్ అయ్యాడు. పైప్ ద్వారా ఆ యువతి ఉంటున్న మూడో ఫ్లోర్‌కి వచ్చాడు. స్పానిష్ యువతి నాలుగు నెలలుగా అక్కడే ఉంటోంది. కిటికీ గుండా లోపలకు వచ్చాడు. అతను తన ముఖానికి కర్చీఫ్‌ను కట్టుకున్నాడు. ఆమెను నిద్ర లేపాడు.

కత్తి చూపించి బెదిరించి దగ్గరున్న నగలను ఇచ్చివేయమని బెదిరించాడని బాధితురాలు పోలీసులకు తెలిపింది. దొంగను చూసి షాక్‌కు గురైన ఆమె వెంటనే బెడ్ మీద నుండి కిందకు దిగి, పక్క ఇంటి తలుపును తట్టింది. కానీ ఇంట్లో ఎవరూ లేరు. దీంతో ఆ దొంగ ఆమెను ఇంటిలోకి లాగాడు. ఆమెపై అత్యాచారం చేశాడు. ఆ తర్వాత మరోసారి ఆమెను నగలు, డబ్బు కోసం అడిగాడు. ఆమె ఇంట్లో కొద్దిగా విదేశీ కరెన్సీ లభించింది.

ఆ తర్వాత ఓ సిగరేట్ ముట్టించి అక్కడే కూర్చున్నాడు. మరోసారి స్పానిష్ యువతి వద్దకు వెళ్లి బలవంతంగా అత్యాచారం చేశాడు. ఆమె సహాయం కోసం ఆర్తనాదాలు చేసింది. ఆమె అరుపులు విన్న వాచ్ మెన్ అవి పక్క బంగ్లాలో నుండి వస్తున్నాయని భావించాడు. దొంగ పారిపోయిన తర్వాత వారు ఆమెను ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దొంగ కోసం వెదుకుతున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+