వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమ్మ, వదిన ఢిల్లీ ఎందుకెళ్లారో మీకు తెలుసా: షర్మిల

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Vijayamma - Sharmila
కర్నూలు/ఖమ్మం: కాంగ్రెసు పార్టీ అధికారంలోకి రావడం దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి పుణ్యమేనని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల అన్నారు. ఆమె మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర గురువారం కర్నూలు జిల్లాలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కాంగ్రెసు పార్టీతో కుమ్మక్కై కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని కాపాడుతున్నారని విమర్శించారు.

అందుకే ఆయన అవిశ్వాసం పెట్టడం లేదని ధ్వజమెత్తారు. రైతులకు మద్దతు ధర లేక అనేక కష్టాలు పడుతున్నారని విమర్శించారు. తన అమ్మ, పార్టీ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మ, తన వదిన భారతి ఢిల్లీ కెళ్లారని, ఆ మర్మమేమిటో చెప్పాలని టిడిపి ప్రశ్నిస్తోందని, వారు అక్కడకు వెళ్లినంత మాత్రాన కుమ్మక్కు అయినట్టా అని ప్రశ్నించారు. వారు ఢిల్లీ ఎందుకు వెళ్లారో టిడిపికి తెలుసా అన్నారు.

తమ లాయర్లు ఢిల్లీలో ఉన్నారని, వారిని కలిసేందుకే వదిన, అమ్మ ఢిల్లీ వెళ్లారన్నారు. కాంగ్రెసుతో కుమ్మక్కయింది మీరు కాబట్టే మీపై కేసులు ఉండవన్నారు. కేసులు ఉండనందుకు ప్రతిఫలంగా మీరు ప్రభుత్వాన్ని కాపాడుతున్నారని ధ్వజమెత్తారు. తమకు కాంగ్రెసుతో కుమ్మక్కు కావాల్సిన అవసరం ఎంతమాత్రమూ లేదన్నారు. మాట ఇవ్వడం, దానిపై నిలబడటం అంటే చంద్రబాబుకు ఈ జన్మలో అర్థం కాదన్నారు.

తుఫానుతో ఇంత నష్టం జరిగినా ప్రభుత్వం స్పందించడం లేదని, రాష్ట్రంలో ఉన్నది దున్నపోతు ప్రభుత్వమని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ వేరుగా ఆరోపించారు. జగన్ అధికారంలోకి వస్తారని, అప్పుడు రైతులకు ప్రత్యేక బడ్జెట్ ప్రవేశ పెట్టి అన్ని విధాలా ఆదుకుంటామని చెప్పారు. నీలం తుఫానులో నష్టపోయిన ఖమ్మం జిల్లా రైతులను ఆమె పరామర్శించారు.

English summary
YSR Congress party leader Sharmila has said YS Vijayamma and Bharati Reddy were went to Delhi to talk about YS Jaganmohan Reddy case with lawyers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X