హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ జగన్ పార్టీలోకి మల్లు స్వరాజ్యం కూతురు

By Pratap
|
Google Oneindia TeluguNews

Karuna
హైదరాబాద్: తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, కమ్యూనిస్టు నేత మల్లు స్వరాజ్యం కూతురు పాతూరి కరుణ శుక్రవారం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ సమక్షంలో పార్టీ లో చేరారు. నల్లగొండ జిల్లాకు చెందిన కరుణతో పాటు శ్రీకళారెడ్డి కూడా పార్టీలో చేరారు.

నల్లగొండ, సూర్యాపేట నియోజకవర్గాల నుంచి ఆమెకు మద్దతుగా వచ్చిన మూడు వేల మంది కూడా ఆ పార్టీలో చేరిపోయారు. 'రాష్ట్రాభివృద్ధి వైసీపీతోనే సాధ్యం. జగన్ ముఖ్యమంత్రి కావాలి' అని ఈ సందర్భంగా కరుణ వ్యాఖ్యానించారు. కరుణ ప్రస్తుతం విమలక్క నేతృత్వంలోని తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్‌లో కొనసాగుతూ వచ్చారు.

కరుణ 2009 ఎన్నికల్లో నల్లగొండ లోకసభ స్థానం నుంచి ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు ప్రజా విశ్వాసాన్ని కోల్పోయాయని కరుణ అన్నారు. ప్రస్తుత పరిస్థితిలో వైయస్ జగన్ ముఖ్యమంత్రి కావాలని తాను కోరుకుంటున్నట్లు మాజీ శాసనసభ్యుడు కీసర జితేందర్ రెడ్డి కూతురు అయిన శ్రీకళా రెడ్డి అన్నారు.

ఇలాఉండగా విజయమ్మ అధ్యక్షతన పార్టీ సిజిసి (కేంద్ర పాలక మండలి) సమావేశమై తుపాను, వరదల వల్ల ప్రజలకు ఎదురైన ఇబ్బందులు, పంటలు, ఆస్తి నష్టం గురించి చర్చించింది. సమావేశానంతరం పార్టీ నాయకుడు, మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ మీడియాతో మాట్లాడారు.

తుపాను, వరదల వల్ల నష్టపోయిన వారిని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. బాధితులను ఆదుకోవడానికి పార్టీ శ్రేణులు రంగంలోకి దిగాలని కోరారు. పార్టీ తరఫున తమ వంతు సహాయం అందించనున్నట్లు ఆయన తెలిపారు.

English summary
Telangana arm struggle leader Mallu Swarajyam's daughter Pathuri Karuna has joined in YS Jagan's YSR Congress party. YSRCP honorary president YS Vijayamma invited Karuna into her party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X