కెసిఆర్‌కు ప్రధాని చెప్పలేదు, అది తప్పు: పాల్వాయి

పదవుల కోసం తెలంగాణ ప్రజా ప్రతినిధులు ఉద్యమాలకు గండి కొడుతున్నారని ఆయన విమర్శించారు. తెలంగాణ ప్రజాప్రతినిధుల వల్లనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో జాప్యం జరుగుతోందని ఆయన అన్నారు. పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా లభించే అవకాశం లేదని ఆయన అన్నారు. పోలవరం, ప్రాణహిత ప్రాజెక్టుల్లో అవకతవకలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. పోలవరం డిజైన్ మార్చకుండా ప్రాజెక్టు కడుతామని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అనడం సరి కాదని ఆయన అన్నారు.
తెలంగాణ ప్రాంతానికి ముఖ్యమంత్రి పదవి ఇవ్వడం ద్వారా రాష్ట్ర విభజనకు పరిష్కారం లభించిందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంతోనే న్యాయం జరుగుతుందని ఆయన అన్నారు. కాంగ్రెసు పార్టీ మోసం చేసిందని కెసిఆర్ అనడం సరి కాదని ఆయన అన్నారు. కెసిఆర్ కాంగ్రెసును విమర్శించడం సమంజసం కాదని ఆయన అన్నారు.
ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ చెప్పడం వల్లనే సకల జనుల సమ్మెను ఆపామని కెసిఆర్ ఇటీవల కరీంనరగ్‌లో జరిగిన పార్టీ మేధోమథన సదస్సు సందర్భంగా అన్న విషయం తెలిసిందే. చర్చలకు కాంగ్రెసు పార్టీ ఆహ్వానించడం వల్లనే తాను ఢిల్లీకి వెళ్లినట్లు ఆయన తెలిపారు. కాంగ్రెసు మోసం చేసిందని ఆయన విమర్శించారు.












Click it and Unblock the Notifications