భార్యాపిల్లలను నరికి చంపిన కసాయి, సిటీలో చోరీ

విజయనగరం జిల్లా గట్యాండ మండలం తెరసాం చెరువు వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు ట్రాక్టర్ అదుపు తప్పి చెరువులో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించారు. పలువురు గాయపడ్డారు. గాయపడినవారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.
మహబూబ్‌నగర్ జిల్లా విలియం కొండ గ్రామం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మరణించారు. లారీ బైక్‌ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో దంపతులు మరణించారు.
కాళ్లూ చేతులూ కట్టేసి చోరీ
సికింద్రాబాద్‌లోని ఆలుగడ్డబావిలో ఆర్టీసీ ఉద్యోగి శివలాల్ నివాసంలో దుండగులు భీభత్సం సృష్టించారు. గత రాత్రి ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు శివలాల్ భార్య నర్మదను బెదిరించి, కాళ్లు, చేతులు కట్టేసి 15 తులాల బంగారం, నగదును అపహరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.












Click it and Unblock the Notifications