అధికార కాంక్షతోనే చంద్రబాబు యాత్ర: పురంధేశ్వరి

రాష్ట్ర ప్రభుత్వం నుంచి వరద నష్టం నివేదికలు రావటంలో ఆలస్యం జరుగుతోందని పురందేశ్వరి అన్నారు. ఆమె శనివారమిక్కడ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం నివేదికలు వేగంగా ఇస్తే కేంద్రం సహాయం అందించటంలో కృషి చేస్తామన్నారు. వరద ప్రాంతాల్లో పర్యటించటంలో ఎంపిపై కన్నా ఎమ్మెల్యేలకే బాధ్యత ఉంటుందని పురందేశ్వరి అన్నారు.
రాజీవ్ గాంధీ ఆశయసాధనకు కృషి చేస్తానని కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి అన్నారు. సామాన్య పౌరుడికి శాస్త్ర సాంకేతిక పరిజ్ఝానం అందించాలన్నదే తన లక్ష్యమని ఆమె శనివారం శ్రీకాకుళం జిల్లాలో అన్నారు. రాష్ట్రానికి సంబంధించి మూడు ఐటి ఫైళ్లు కేంద్రం వద్ద పరిశీలనలో ఉన్నాయని, వాటికి త్వరలోనే కదలిక తెస్తామని ఆమె చెప్పారు.
డ్రైనైజీలను ఆధునీకీకరించకపోవడం వల్లనే పంటలు నీటిలో మునిగాయని మరో కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి అన్నారు. ప్రకాశం జిల్లాలో ఆమె శనివారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. పంట నష్టాన్ని అంచనా వేసేందుకు త్వరలో కేంద్ర బృందం రాష్ట్రానికి వస్తుందని చెప్పారు. దళారుల నుంచి వినియోగదారులను కాపాడడానికే రాయితీ సిలిండర్లపై ఆంక్షలు విధించినట్లు ఆమె తెలిపారు.












Click it and Unblock the Notifications