కిరణ్ ప్రభుత్వానికి చంద్రబాబు సలహాదారు: షర్మిల

త్వరలో రాజన్న రాజ్యం వస్తుందని, ప్రజల కష్టాలు తీరుతాయని ఆమె హామీ ఇచ్చారు. శనివారం మధ్యాహ్నం రాతనలో ఆమె పార్టీ జెండాను ఆవిష్కరించి, వైయస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. షర్మిలకు గ్రామ మహిళలు తమ సమస్యలను వినిపించారు. ప్రస్తుతం రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తోందని ఆమె విమర్శించారు జగన్ ముఖ్యమంత్రి అయితే మళ్లీ వైయస్ పాలన వస్తుందని ఆమె అన్నారు.
పాదయాత్రలో శాసనసభ్యురాలు శోభా నాగిరెడ్డి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన మద్దాల రాజేష్ కుమార్, కోట హరిచక్రపాణి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తుగ్గలిలో షర్మిల రైతులను కలిశారు. వైయస్ పాలన ఉండి ఉంటే రైతులకు కష్టాలు ఉండేవి కావని ఆమె అన్నారు. వృద్ధులకు పింఛన్లు రావడం లేదని, రైతులకు ఏడు గంటల కరెంట్ అందడం లేదని ఆమె అన్నారు.
వైయస్ హయాంలో ఎప్పటికప్పుడు సమస్యలను పరిష్కరించేవారని షర్మిల అన్నారు. ఇప్పుడు ప్రభుత్వం సమస్యలను పట్టించుకోవడం లేదని అన్నారు. షర్మిల పాదయాత్ర శనివారంనాడు 24వ రోజుకు చేరుకుంది. కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలపై ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు.












Click it and Unblock the Notifications