పెళ్లి చేసుకుంటానని చెప్పి లవర్ కిడ్నీ అమ్మిన వ్యక్తి

బాధితురాలిని మంజు అలియాస్ చించుగా గుర్తించారు. మంజు 2009లో ఫిర్యాదు చేసిందని పోలీసులు చెప్పారు. కిడ్నీని తీయడానికి తిరువనంతపురంలోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స చేశారు. తన కిడ్నీని ఒక్కదాన్ని విక్రయిస్తే శివకుమార్ తనను పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చాడని మంజు తన ఫిర్యాదులో ఆరోపించింది.
శివకుమార్ హామీతో తన కిడ్నీని పది లక్షల రూపాయలకు విక్రయించినట్లు ఆమె తెలిపింది. కిడ్నీ మార్పిడికి శివకుమార్ నకిలీ లీగల్ డ్యాక్యుమెంట్స్ తయారు చేసినట్లు సమాచారం. కిడ్నీని తీయగానే శివకుమార్ కనిపించకుండా పోయాడు.
కిడ్నీ రాకెట్‌కు సంబంధించిన పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు. నార్త్ ఎస్సై విజయశంకర్ నేతృత్వంలోని పోలీసు బృందం శివకుమార్‌ను అరెస్టు చేసింది. కిడ్నీ రాకెట్ ముఠాకు సంబంధించిన గుట్టును తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications