వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇంతగా ఆగారు, కొంతకాలం ఆగలేరా:తెలంగాణపై షిండే

By Pratap
|
Google Oneindia TeluguNews

Sushil Kumar Shinde
న్యూఢిల్లీ: తెలంగాణపై ఇంత కాలం ఆగారు, సమస్య పరిష్కారానికి మరి కొంత కాలం ఆగలేరా అని కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే అన్నారు. నెలవారీ నివేదికను వెల్లడించడానికి ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆయన శనివారం తెలంగాణపై స్పందించారు. తెలంగాణపై అఖిల పక్ష సమావేశాన్ని ఎప్పుడైనా ఏర్పాటు చేయవచ్చునని ఆయన అన్నారు.

తెలంగాణపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు రాసిన లేఖ తనకు అందలేదని చెప్పారు. తెలంగాణపై ఇప్పటికే పూర్తి స్థాయి చర్చలు జరిగాయని, సంప్రదింపులు జరుగుతున్నాయని ఆయన అన్నారు. గతంలో అఖిల పక్ష సమావేశంలో కూడా తెలంగాణపై చర్చించామని షిండే గుర్తు చేశారు.

సూరజ్‌కుండ్ పార్టీ మేధోమథనం సదస్సులో తెలంగాణపై చర్చించలేదని, 10జనపథ్‌లో తెలంగాణపై చర్చించామని ఆయన తెలిపారు. తెలంగాణపై ఎప్పుడు నిర్ణయం తీసుకుంటామో చెప్పలేమని ఆయన అన్నారు. అఖిల పక్ష సమావేశం పార్లమెంటు సమావేశాల సందర్భంగానైనా జరగవచ్చు, పార్లమెంటు సమావేశాల తర్వాతనైనా జరగవచ్చునని ఆయన అన్నారు.

సూరజ్‌కుండ్‌ మేధోమథన సదస్సు తర్వాత సోనియా గాంధీ నివాసంలో జరిగిన కోర్ కమిటీ సమావేశంలో తెలంగాణపై చర్చించినట్లు సమాచారం. ఈ కోర్ కమిటీ సమావేశంలో పలు విషయాలు చర్చించామని షిండే చెప్పారు. శుక్రవారం జరిగిన కోర్ కమిటీ సమావేశంలో తక్షణంగా నిర్ణయం తీసుకోవాల్సిన అంశాలపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే తెలంగాణపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే తెలంగాణ సమస్యకు పరిష్కారం కనుక్కోవాల్సిన అవసరాన్ని కాంగ్రెసు అధిష్టానం గుర్తించినట్లు చెబుతున్నారు.

English summary
The Union Minister Sushil kumar Shinde said that all party meeting on Telangana will be held on Telangana issue on any time. it may be during parliament session or after session, he told.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X