ఇద్దరు యువతుల మృతి: హత్యా, ఆత్మహత్యా?

కళాశాలకంటూ వారు మూడు రోజుల క్రితం ఇంటి నుంచి బయలుదేరి వరంగల్ వెళ్లారు. రైల్వే ట్రాక్‌పై వారి చెప్పులు పడి ఉండడాన్ని బట్టి మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వారు ఆత్మహత్య చేసుకున్నారా, వారిని ఎవరైనా హత్య చేశారా అనే కోణం నుంచి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రేమవ్యవహారం కారణంగా వారు ఆత్మహత్య చేసుకుని ఉండే అవకాశాలు కూడా ఉన్నాయని అంటున్నారు.
అనూష, వనిత మంగళవారం మధ్యాహ్నం హనుకొండలోని ఓ థియేటర్‌లో సినిమా చూసినట్లు వారి వద్ద లభించిన టికెట్లను బట్టి తెలుస్తోంది. అయితే, వారితో పాటు మరొకరు కూడా సినిమా చూసినట్లు తెలియడంతో తొర్రూరుకు చెందిన ఓ అబ్బాయికి ఫోన్ చేసి మాట్లాడారు. సినిమా చూసిన తర్వాత అమ్మాయిలను ఇద్దరిని తాను బస్సు ఎక్కించానని ఫోన్‌లో తొర్రూరు అబ్బాయి చెప్పినట్లు సమాచారం. ఇద్దరు అమ్మాయిల్లో ఒక్కరు ఆ అబ్బాయితో ప్రేమ వ్యవహార నడుపుతున్నట్లు అనుమానిస్తున్నారు.
పోలీసులు అబ్బాయిని అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నించారు. అయితే, అతను అందుబాటులో లేడని సమాచారం. అమ్మాయిల కుటుంబ సభ్యులను పోలీసులు ప్రశ్నించారు. కాలేజీ యాజమాన్యాన్ని కూడా విచారించారు. సహ విద్యార్థులను కూడా పోలీసులు ప్రశ్నించారు. అయితే, వారి మృతికి స్పష్టమైన కారణమేదీ తెలియడం లేదు.
ట్రాక్ దాటుతున్న సమయంలో రైలు ఢీకొట్టి ఉంటుందనే అనుమానాలు కూడా వ్యక్తమవుతోంది. అమ్మాయిల కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. చదువులో ముందంజలో ఉండే అమ్మాయిలు ఎందుకు ఇలా మరణించారనేది వారికి అంతు పట్టని విషయంగా మారింది.












Click it and Unblock the Notifications