విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చిరంజీవి ర్యాలీ: ఎమ్మెల్యే రవి వర్సెస్ దేవినేని అవినాష్

By Pratap
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
విజయవాడ: కేంద్ర మంత్రి, కాంగ్రెసు నాయకుడు చిరంజీవి ర్యాలీ సందర్భంగా విజయవాడ కాంగ్రెసులో వర్గపోరు బయటపడింది. విజయవాడ తూర్పు శాసనసభ్యుడు యలమంచిలి రవి, యువ నేత దేవినేని అవినాష్ వర్గాల మధ్య చిచ్చు రేగింది. చిరంజీవి ర్యాలీలో దేవినేని అవినాష్‌కు ప్రాధాన్యం ఇవ్వడంపై యలమంచిలి రవి వర్గం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అవినాష్ వర్గంతో గొడవకు దిగింది.

గత ప్రజారాజ్యం పార్టీ తరఫున యలమంచిలి రవి విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి శానససభకు ఎన్నికయ్యారు. ప్రజారాజ్యం విలీనంతో ఆయన కాంగ్రెసు శానససభ్యుడయ్యారు. ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో ఏర్పాటైన బాలల దినోత్సవంలో పాల్గొనేందుకు బుధవారం చిరంజీవి విజయవాడ వచ్చారు. ఆయన విమానాశ్రయం నుంచి స్టేడియం వరకు ర్యాలీగా వచ్చారు.

ఈ ర్యాలీ సందర్భంగా విజయవాడ తూర్పు నియోజకవర్గంలో చిరంజీవి పక్కన తమ శాసనసభ్యుడు ఉండాలంటూ యలమంచిలి రవి వర్గీయులు నిరసనకు దిగారు. యలమంచిలి వర్గాన్ని దేవినేని అవినాష్ వర్గం వ్యతిరేకించింది. ఇరు వర్గాల మధ్య గొడవ చోటు చేసుకుంది.

చిరంజీవి, పక్కనే ఉన్న పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ ఇరు వర్గాలకు సర్ది చెప్పారు. చిరంజీవి పక్కన దేవినేని అవినాష్ ఉండడంపై యలమంచిలి రవి వర్గం వ్యతిరేకత వ్యక్తం చేసింది. విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో బాలల దినోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది.బాలలు వివిధ ప్రదర్సనలు ఇచ్చారు. వాటిని చిరంజీవి తిలకించారు.

English summary

 Vijayawada congress witnessed group clashes during union minister Chiranjeevi rally at Vijayawada. MLA Yalamnachali Ravi and Devineni Avinash groups clahed during Chiranjeevi's rally. 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X