21.48 మిలియన్ డాలర్లు పలికిన గోల్కొండ వజ్రం

ప్రపంచవ్యాప్తంగా గోల్కొండ వజ్రానికి, వర్ణరహిత వజ్రం క్యారట్‌కు పలికే ధరల విషయంలో ఇదే రికార్డు. క్రిస్టీ అంతర్జాతీయ ఆభరణాల శాఖ డైరెక్టర్ ఫ్రాంకియోస్ కూరీల్ ఈ విషయం చెప్పారు. ఈ గోల్కొండ వజ్రం ఆస్టియాకు చెందిన అర్చుడుకే జోసెఫ్ ఆగస్టుకు చెందింది. అతను 1962లో మరణించాడు. ఈ వజ్రాన్ని 1933లో ఆస్ట్రియా రాకుమారుడు హంగేరీ జనరల్ క్రెడిట్ బ్యాంక్ వాల్ట్‌లో డిపాజిట్ చేశాడు.
మూడేళ్ల తర్వాత దాన్ని ఓ ఐరోపా బ్యాంకర్‌కు విక్రయించారు. అప్పటి నుంచి అది ఫ్రాన్స్‌లో సేఫ్ డిపాజిట్ బాక్సులో ఉంది. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో అది ఎవరి కంటపడకపోవడం అదృష్టమని క్రిస్టీ అన్నారు. ఆ వజ్రాన్నిి 1961 ఒకసారి, 1993లో మరోసారి వేలం వేశారు. మళ్లీ ఇప్పుడు క్రిస్టీ దాన్ని వేలం వేశారు. ఈ వజ్రం భారీ స్ట్రా బెర్రీ సైజులో ఉంది.
మంగళవారంనాడు మొదటి బిడ్ 8 మిలియన్ల స్విస్ ఫ్రాన్స్‌లు పలికింది. కొద్దిసేపట్లోనే బిడ్ సొమ్ము పెరుగుతూ పోయింది. టెలిఫోన్ ద్వారా ఓ వ్యక్తి 20.355 స్విస్ ఫ్రాన్స్‌లకు ఓ వ్యక్తి దాన్ని సొంతం చేసుకున్నాడు. అతను తన పేరు వెల్లడించడానికి నిరాకరించాడు. కోహినూర్ వజ్రంతో పోల్చదగ్గ వజ్రం ఇది అని అమెరికా, స్విట్టర్లాండ్‌ల్లో క్రిస్టీ ఆభరణాల అధిపతి రాహుల్ కడాకియా అన్నారు.
-
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
HRA: హైదరాబాద్ లో ఉండే వారికి భారీ గుడ్ న్యూస్, ఏప్రిల్ 1 నుంచే.. -
రంజాన్ స్పెషల్ స్వీట్ "డబుల్ కా మీటా" ఇలా ట్రై చేస్తారా..? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు!












Click it and Unblock the Notifications