మజ్లిస్ పార్టీ: ఒకేలా స్పందించిన నారా లోకేష్, షర్మిల

నారా లోకేష్ ట్విట్టర్‌లో మజ్లిస్ నిర్ణయాన్ని స్వాగతించారు. తాను అసదుద్దీన్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానని, ముస్లింలకు న్యాయం చేయడంలో కాంగ్రెసు ప్రభుత్వం విఫలమైందని, కాంగ్రెసు శాంతిని పెంపొందించలేకపోతోందని, దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి రిజర్వేషన్ బిల్లును పాస్ చేయలేక పోయారని ట్విట్టర్‌లో విమర్శించారు.
కర్నూలు జిల్లా మరో ప్రజా ప్రస్థానం పాదయాత్రలో షర్మిల మజ్లిస్ నిర్ణయాన్ని స్వాగతించారు. బుధవారం షర్మిల పాదయాత్ర ఆదోనికి చేరుకుంది. ఈ సమయంలో ఆమె మాట్లాడుతూ... మజ్లిస్ నిర్ణయాన్ని తాము స్వాగతిస్తున్నామని, కిరణ్ ప్రభుత్వం మైనార్టీలో పడిపోయిందని, కాబట్టి తెలుగుదేశం వెంటనే అవిశ్వాస తీర్మానం పెట్టాలని ఆమె డిమాండ్ చేశారు. కాగా ఆదోనిలో ఉన్న షర్మిలను వైయస్ విజయమ్మ కలుసుకున్నారు.












Click it and Unblock the Notifications