దోశ చేయలేదని భార్యను చంపాడు: హైదరాబాదీలు

Tamilnadu Map
చెన్నై: ఆమె ఆరు నెలల నిండు గర్భిని. నిండు చూలాలన్న దయ కూడా లేకుండా ఓ మహిళను స్వయానా భర్తనే గొంతు నులిమి ప్రాణం తీసిన ఘటన చెన్నైలో జరిగింది. భార్యను చంపిన సమయంలో అతను పీకల దాకా మద్యం సేవించి ఉన్నాడు. పొట్ట కూటి కోసం హైదరాబాద్ సమీప గ్రామం నుంచి శ్రీనివాసులు, గీత అనే దంపతులు చెన్నైలోని మేడవాక్కం కూడలి రోడ్డు ప్రాంతంలో ఓ అద్దె ఇంటిలో ఉంటున్నారు.

వీరు భవన నిర్మాణ కార్మికులుగా పనిచేస్తున్నారు. మంగళవారం రాత్రి ఇద్దరి మధ్య వివాదం చోటుచేసుకుంది. తనకు దోశలు వేసి పెట్టలేదని ఉద్రేకానికి లోనైన శ్రీనివాసులు భార్యపై విరుచుకుపడ్డాడు. మొదట కడుపులో గుద్ది, ఆ తర్వాత గొంతు నులిమాడని గీత తన మరణానికి ముందు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో తెలిపింది.

మంగళవారం రాత్రి ఇంటికి వచ్చిన శ్రీనివాసులు తనకు దోశ చేసి పెట్టాలని భార్యను అడిగాడు. తనకు చేత కావడం లేదని చెప్పినా అతను వినలేదు. గర్భిణి, లేవలేని స్థితిలో ఉన్న భార్య గొంతు పట్టుకుని నులిమేశాడు. దీంతో ఆమె స్రృహ కోల్పోయి కింద పడిపోయింది. వారికి మూడేళ్ల క్రితం పెళ్లయింది.

సమాచారం తెలుసుకున్న చుట్టుపక్కల వారు గీతను సమీప ఆస్పత్రికు తరిలించారు. ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. భార్య మరణించిన విషయం తెలియగానే శ్రీనివాసులు పరారయ్యాడు. అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. క్షణికావేశం నిండు గర్భిణి ప్రాణాలను తీసింది.

శ్రీనివాసులు మద్యానికి బానిసయ్యాడని, రోజూ తాగి వచ్చి భార్యతో గొడవ పడేవాడని ఇరుగుపొరుగువారు చెప్పారు. స్పృహ తప్పి గీత పడిపోగానే శ్రీనివాసులు పారిపోయాడని చెప్పారు. గీత బుధవారం ఉదయం మరణించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+