హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పాతబస్తీ: ఆంక్షల సడలింపు, 144వ సెక్షన్ కొనసాగింపు

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: అల్లర్లు చెలరేగిన హైదరాబాద్ పాతబస్తీలో సాధారణ పరిస్థితులను నెలకొల్పడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. చార్మినార్ వద్ద తాత్కాలికంగా ఆంక్షలను సడలించారు. వాహనాల రాకపోకలకు అనుమతించారు. శాలిబండ, చార్మినార్ వద్ద బారీకేడ్లను తొలగించారు. పరిస్థితి అదుపులోనే ఉంది. అయితే, భారీగా అదనపు బలగాలను మోహరించారు. బస్తీల్లో నిఘా కెమెరాలు, పికెట్లు ఏర్పాటు చేసి పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

Police trying for normalcy in Old city

శుక్రవారం అల్లర్లకు బాధ్యులైన 50 మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఉద్రిక్తతల నేపథ్యంలో శనివారం వ్యాపార సంస్థలు తెరిచే విషయంపై పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుంటామని హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ అనురాగ్ శర్మ చెప్పారు. హైదరాబాద్‌లోని పాతబస్తీ శుక్రవారం పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. శుక్రవారం ఓవైపు ప్రార్థనలు, మరోవైపు చార్మినార్ వద్ద గల భాగ్యలక్ష్మి ఆలయం వద్ద పూజల నేపథ్యంలో భారీగా బందోబస్తును ఏర్పాటు చేశారు.

అయితే మక్కా మసీదు వద్ద ప్రార్థనల అనంతరం అల్లరి మూకలు చెలరేగిపోయాయి. ప్రార్థనల అనంతరం పలువురు ఆందోళనకారులు పోలీసుల పైన, మీడియా పైన రాళ్లు రువ్వారు. పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. పోలీసులు పరిస్థితిని సరిదిద్దే ప్రయత్నాలు చేశారు. అయితే అల్లరిమూకలు ఎంతకూ తగ్గక పోవడంతో పోలీసులు బాష్పవాయువును ప్రయోగించారు. ఆందోళకారులు మీడియాకు, పోలీసులకు చెందిన పలు వాహనాలను ధ్వంసం చేశారు.

మూడు నాలుగు వాహనాలకు నిప్పు పెట్టారు. పలు బైకులు, దుకాణాలు ధ్వంసమయ్యాయి. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసుల ఆంక్షలను జవదాటారు. ముందస్తు జాగ్రత్తగా పోలీసులు చార్మినార్ పరిసరాల్లో సిసి కెమెరాలు ఏర్పాటు చేశారు. రాళ్ల దాడిలో ఎసిపి స్వల్పంగా గాయపడ్డారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారటంతో మరింతమంది పోలీసులను మోహరించారు. సాయంత్రం వరకు పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకు వచ్చారు. ఎవరూ ఎలాంటి ఆవేశాలకు లోనుకావొద్దని హోంమంత్రి సబితా ఇంద్రా రెడ్డి పిలుపునిచ్చారు. మతసామరస్యానికి ప్రతీకగా నిలవాలన్నారు.

వదంతులు ఎవరూ నమ్మవద్దని సమాచార శాఖ కమిషనర్ చంద్రవదన్ విజ్ఞప్తి చేశారు. పాతబస్తీ ప్రశాంతంగానే ఉందన్నారు. ప్రజలు అందరూ సంయమనంతో ఉండాలని, పరిస్థితి అంతా అదుపులోనే ఉందని ఆయన చెప్పారు. పరిస్థితిని ఎప్పటికి అప్పుడు సమీక్షిస్తున్నామని సిపి అనురాగ్ శర్మ చెప్పారు.

English summary
Police are trying to establish normal situation in the old city of Hyderabad. Violence broke out once again near Charminar in the old city of Hyderabad Friday over a temple row. At least seven people were injured in stone pelting by an unruly mob, and baton charge by police.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X