వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్, బాబు: చిరు 150 సినిమా ప్రత్యామ్నాయమా!?

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: అధిష్టానం అనుమతిస్తే 150వ సినిమా చేస్తానని కేంద్రమంత్రి చిరంజీవి ప్రకటించడంతో మెగాస్టార్ అభిమానులు కేరింతలు కొడుతున్నారు. సినిమా మాధ్యమం ద్వారా ప్రజల్లోకి వెళ్లడం చాలా సులభమని, అదీ చిరంజీవి వంటి హీరో నటిస్తే పార్టీకి పెద్ద ప్లస్ అవుతుందని కాంగ్రెసు పార్టీ భావిస్తుంది. ఇప్పటికే ఓ వైపు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి, మరోవైపు తెలంగాణ సమస్యలతో కొట్టుమిట్టాడుతూ.. ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీకి హీరో నందమూరి బాలకృష్ణ పెద్ద ఎసెట్‌గా మారనున్న నేపథ్యంలో చిరు సినిమా తీయడమే మంచిదని ఆ పార్టీ భావిస్తుందని అంటున్నారు.

Chiranjeevi's 150th film: Congress in happy

ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెసు పార్టీ పరిస్థితి దారుణంగా ఉంది. కార్యకర్తల్లో ఉత్సాహం నింపేందుకు, ప్రజల్లోకి పార్టీని మరింత తీసుకు వెళ్లేందుకు కావాల్సిన ఇమేజ్ ఉన్న నేత కనుచూపు మేరల్లో కనిపించడం లేదు! ఒక్క చిరంజీవి తప్ప! అలాంటి చిరంజీవి సినిమా 2014 ఎన్నికలకు ముందు విడుదలయితే పార్టీకి లాభం అని కాంగ్రెసు ఢిల్లీ పెద్దలు కూడా భావిస్తున్నారని చెప్పవచ్చు. కేంద్ర మంత్రి గులాం నబీ ఆజాద్ తనతో 150 చిత్రం చేయాల్సిందిగా సూచించారని చిరు స్వయంగా గతంలో చెప్పారు.

నాలుగు రోజుల క్రితం చిరు మాట్లాడుతూ కూడా అధిష్టానం ఒప్పుకుంటే అని చెప్పారు. ఆజాద్ వ్యాఖ్యలను బట్టి అధిష్టానం చిరు 150వ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందనే చెప్పవచ్చు. అంతేకాకుండా రాష్ట్రంలో చిరుకు ఉన్న ఇమేజ్‌కు 2014లో కాంగ్రెసుకు అనుకూలంగా ఉన్న ఓ సినిమా వస్తే పార్టీకి చాలా లాభమని కూడా అధిష్టానం భావిస్తుంది. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెసు పరిస్థితి బాగా లేని ప్రస్తుత తరుణంలో చిరంజీవి ఇమేజ్, సినిమాతోనైనా గట్టెక్కవచ్చునని భావిస్తుండవచ్చు. కాబట్టి 150 సినిమా కోసం చిరు కంటే ముందే ఢిల్లీ నేతలు ఒత్తిడి తెచ్చే అవకాశం లేకపోలేదంటున్నారు.

చిరు 150వ సినిమాపై మరోసారి ప్రకటన చేయడంతో అభిమానుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. అభిమానులతో పాటు కాంగ్రెసు పార్టీ కార్యకర్తల్లోనూ నూతనోత్తేజం తొణకిసలాడుతోంది. ఇన్నాళ్లూ నిస్తేజంగా ఉన్న పార్టీకి చిరు సినిమాతో కొత్త ఊపు వస్తుందని భావిస్తున్నారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి హవాను, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడును మూడోసారి ప్రతిపక్షానికే పరిమితం చేయాలంటే చిరు సినిమాను తప్పక చేయాల్సిందేననే అభిప్రాయాలు పార్టీలో వ్యక్తమవుతోందట.

కడప, పులివెందుల ఆ తర్వాత వచ్చిన పలు ఉప ఎన్నికల్లో చిరంజీవి ఇమేజ్ ఏమయిందని ప్రశ్నించే వారికి కాంగ్రెసు నేతలు, చిరు అభిమానులు సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారట. సెంటిమెంట్ కారణంగానే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గెలిచిందని, 2014 వరకు సెంటిమెంట్ పని చేయదని, అప్పుడు చిరు గ్లామర్ తప్పక ఉపయోగపడుతుందని చెబుతున్నారు. సెంటిమెంట్ కారణంగా మహామహులు, గెలుస్తాయనుకున్న పార్టీలు ఓడిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయని చెబుతున్నారు.

150వ సినిమా మరోసారి తెర పైకి రావడంతో... దర్శకుడు ఎవరు? హీరోయిన్ ఎవరు? తదితర అంశాలపై జోరుగా చర్చ సాగుతోంది. తమ అభిమాన హీరో రీ ఎంట్రీతో కేక పుట్టిస్తారని అభిమానులు గట్టిగా నమ్ముతున్నారు. చిరు 150వ సినిమా వస్తే దానికి నిర్మాతగా రామ్ చరణ్ తేజ ఉంటాడని ఇప్పటికే తేలిపోయింది. సినిమా చేస్తే ఖచ్చితంగా సామాజిక అంశంతో పాటు పొలిటికల్ టచ్ ఉంటుందని, అదీ కాంగ్రెసుకు లబ్ధి చేకూరేలా ఉంటుందని చెప్పవచ్చు.

మొత్తానికి చిరంజీవి తదుపరి చిత్రం అభిమానులను సంతోష పెట్టాలి, మాస్‌ను ఆకర్షించాలి, అలాగే తనకు, కాంగ్రెసు పార్టీకి పొలిటికల్ మైలేజ్ తీసుకు రావాలి. ఇటీవల పలు సినిమాలు విమర్శలకు గురైన విషయం తెలిసిందే. చిరు సినిమా అంటే ప్రతిపక్షాలు భూతద్దంలో చూసి దానిపై రాద్దాంతం చేసే అవకాశముంటుంది. కాబట్టి ఆ కోణంలో ఎలాంటి వివాదం చెలరేగకుండా వచ్చే సినిమా ఉండాలి. ఈ సినిమా 2013 సంవత్సరం రెండో సగంలో ఖచ్చితంగా వస్తుందని భావిస్తున్నారు.

English summary
The fans of Magastar and Congress party cadre is in happy with central minister Chiranjeevi announcment about his 150th film.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X