జగన్ వైపు ఎమ్మెల్యేలు: కెసిఆర్‌కు కడియం హెచ్చరిక

తెలంగాణ అభిమానులు, రాజకీయ పార్టీల నేతలు ఈ పరిణామాలను గమనించాలని పిలుపు నిచ్చారు. తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. సోమవారం హన్మకొండలోని ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ సమస్యపై గళమెత్తిన కొందరు శాసనసభ్యులు, మాజీ మంత్రులు, నాయకులు కులం, డబ్బు, అధికార వ్యామోహంతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి వలస పోతున్నారని విమర్శించారు.
వైయస్ జగన్మోహన్ రెడ్డి ఏం త్యాగం చేశాడని ఆయన పార్టీలోకి వెళ్తున్నారని ప్రశ్నించారు. సెజ్‌ల పేరుతో తెలంగాణ భూములను కొల్లగొట్టి, ఇక్కడి వనరులను దోచుకొని, విద్య, ఉద్యోగాలతో సహా అన్ని రంగాల్లో ప్రజలకు అన్యాయం చేసిన దివంగత వైయస్ రాజశేఖర రెడ్డికి వారసుడు జగన్ అన్నారు. తెలంగాణకు వ్యతిరేకంగా పార్లమెంట్‌లో ప్లకార్డులు ప్రదర్శించిన జగన్ పార్టీలో ఎలా చేరుతారన్నారు.
అటువంటి వ్యక్తి పంచన చేరడం తెలంగాణ ఉద్యమానికి ద్రోహం చేసినట్టే అన్నారు. తెలంగాణ ఉద్యమానికి విఘాతం కలిగే సంకేతాలను గమనించి ఇప్పటికైనా కల్వకుంట్ల చంద్రశేఖర రావు మేలుకోవాలని, లేకుంటే ఆయన చివరికి ఫామ్‌హౌస్‌కే శాశ్వతంగా పరిమితం కావలసి వస్తుందని హెచ్చరించారు.












Click it and Unblock the Notifications