వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ పార్టీలోకి వెళ్లకుండా కోమటిరెడ్డికి కెకె బ్రేక్‌లు

By Pratap
|
Google Oneindia TeluguNews

K Keshav Rao - Komatireddy Venkat Reddy
హైదరాబాద్: వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరాలనే మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రయత్నాలను కాంగ్రెసు సీనియర్ నేత కె. కేశవరావు అడ్డుకున్నట్లు తెలుస్తోంది. తెలంగాణకు చెందిన సీనియర్ మంత్రి కె. జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి బుధవారం కేశవరావుతో సమావేశమయ్యారు. మధ్యలో పార్లమెంటు సభ్యుడు రాజయ్య భేటీలో చేరారు.

కోమటిరెడ్డి వెంకటరెడ్డి త్వరలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరుతారంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యం చేకూరింది. కెకెతో భేటీ తర్వాత జానా రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీడియాతో మాట్లాడకుండానే వెళ్లిపోయారు. కేశవ రావు కూడా మీడియాతో మాట్లాడడానికి నిరాకరించారు. అయితే మీడియా ప్రతినిధులు మరీ పట్టుబట్టడంతో వివరాలు చెప్పారు.

వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరబోనని కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పినట్లు కేశవరావు తెలిపారు. తెలంగాణ సాధన కోసం తమతో కలిసి వస్తానని చెప్పారని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం త్వరలోని తెలంగాణ ఐక్య వేదికను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఐక్య వేదికకు త్వరలోనే ఓ రూపం వస్తుందని కెకె చెప్పారు. ఒక రూపం వచ్చిన తర్వాత తెలంగాణ ఐక్య వేదిక వివరాలు వెల్లడిస్తామని ఆయన అన్నారు. మూడేళ్లుగా ఐక్య వేదిక ఏర్పాటుకు ప్రయత్నాలు సాగుతున్నాయని చెప్పారు.

అలా అయితే జగన్ పార్టీలోకి వెళ్లరు

ఇదిలావుంటే, తెలంగాణను కోరుకునే వారు ఎవరు కూడా జగన్ పార్టీలోకి వెళ్లరని నిజామాబాద్ కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు మధుయాష్కి అన్నారు. అలా వెళ్లినవారు తెలంగాణ ద్రోహులేనని ఆయన బుధవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. అవినీతి, అక్రమాలకు మారుపేరైన జగన్ పార్టీకి తెలంగాణలో చోటు ఉండదని ఆయన అన్నారు. ప్రత్యేక తెలంగాణపై ఒత్తిడి తేవడానికి అవిశ్వాస తీర్మానాన్ని వాడకుంటామని యాష్కీ చెప్పారు.

తెలంగాణకు ప్యాకేజీలు, పదవులు అంటే సమస్యను నాన్చడమేనని ఆయన అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)లు తమ ప్రాబల్యాన్ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నాయని ఆయన విమర్శించారు. పార్టీలు మారితే ఆయా పార్టీలు బలోపేతమవుతాయే తప్ప తెలంగాణ సమస్య పరిష్కారం కాదని యాష్కీ అన్నారు.

English summary

 Congress sebior leader K Keshav Rao said that dormer minister Komatireddy Venkat Reddy was not joining YS Jagan's YSR Congress party. He said that Telangana united front will be formed soon.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X