జగన్ కేసుకు మూణ్ణెళ్లు: ఒత్తిళ్లు లేవన్న సిబిఐ డైరెక్టర్

కాగా అక్రమాస్తుల కేసులో వైయస్ జగన్మోహన్ రెడ్డి మే 27న అరెస్టయిన విషయం తెలిసిందే. ఆయన అరెస్టే నేటితో ఆరు నెలలు పూర్తయింది. ఈ ఆరు నెలల కాలంలో జగన్ బెయిల్ కోసం నాంపల్లి సిబిఐ ప్రత్యేక కోర్టు నుండి సుప్రీం కోర్టు వరకు ప్రయత్నించారు. కానీ ఆయనకు చుక్కెదురయింది.
ఇటీవల సుప్రీం కోర్టుకు బెయిల్ కోసం వెళితే ఇటు జగన్‌కు అటు సిబిఐకి కోర్టు సూచనలు చేసింది. మార్చి నెలాఖరులోగా జగన్ కేసు విచారణను పూర్తి చేయాలని సిబిఐకి డెడ్ లైన్ విధించింది. అదే సమయంలో కేసు విచారణకు తాము విధించిన గడువు వరకు బెయిల్‌ను కోరవద్దని సూచించింది
గడువు దాటిన తర్వాత బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చునని తెలిపింది. అయితే ఇటీవల జగన్ నాంపల్లిలోని సిబిఐ ప్రత్యేక కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అరెస్టు చేసి 90 రోజులు దాటినందున బెయిల్ ఇవ్వాలని జగన్ వాదిస్తే.. సుప్రీం కోర్టు చెప్పినప్పటికీ బెయిల్ ఇవ్వాలని ఎలా అడుగుతారని సిబిఐ వాదించింది. ఈ కేసు విచారణ ఈ నెల 28కి వాయిదా పడింది.












Click it and Unblock the Notifications