హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వాపు - బలుపు: వైయస్ జగన్‌కు 'సెంటిమెంట్' ట్విస్ట్!

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి తెలంగాణ ప్రాంతంలో వాపును చూసి బలుపు అనుకుంటున్నారా అంటే అవుననే అంటున్నారు. సీమాంధ్రలో దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి మృతి కారణంగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి సెంటిమెంట్ కలిసి వచ్చిందని, అది ఎంతో కాలం ఉండదని అంటున్నారు. అయితే తెలంగాణలో మాత్రం ఆ సెంటిమెంట్ మాత్రం ఏమాత్రం లేదని, వైయస్ సెంటిమెంట్ కంటే ప్రత్యేక రాష్ట్ర సెంటిమెంటే బలంగా ఉందని చెబుతున్నారు.

వాపు-బలుపు: జగన్‌కు 'సెంటిమెంట్' ట్విస్ట్!

వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి తెలంగాణ ప్రాంతంలోని వలసలు కేవలం వాపు మాత్రమేనని బలుపు కాదనే వాదనలు వినిపిస్తున్నాయి. సీమాంధ్ర ప్రభావం, పరకాల ఉప ఎన్నికలు చూసిన పలువురు నేతలు ఆ పార్టీలోకి చేరుతున్నారే కానీ తెలంగాణ సెంటిమెంటును ఆ పార్టీ బీట్ చేయలేదనే వాదనలు వినిపిస్తున్నాయి.

వాపు-బలుపు: జగన్‌కు 'సెంటిమెంట్' ట్విస్ట్!

పరకాల ఉప ఎన్నిక తర్వాతనే జగన్ తెలంగాణలో దూకుడు పెంచారని కానీ ఆ నియోజకవర్గంలో, జిల్లాలో కొండా దంపతుల పట్టు అందరికీ తెలిసిందే అంటున్నారు. ఆ కారణంగానే ఉప ఎన్నికల్లో సురేఖ రెండో స్థానంలో నిలిచారే తప్ప తెలంగాణ సెంటిమెంటును జగన్ ఢీకొన్నందువల్ల కాదంటున్నారు.

వాపు-బలుపు: జగన్‌కు 'సెంటిమెంట్' ట్విస్ట్!

తెలుగుదేశం పార్టీకి తెలంగాణ ప్రాంతంలో క్యాడర్ ఉందని, అందుకే ఆ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పాదయాత్రకు స్పందన కనిపిస్తోందని అంటున్నారు. కాంగ్రెసు పార్టీకి క్యాడర్ ఉండటంతో పాటు అధికారంలో ఉన్నందువల్లే దాని ప్రాభవం అంతగా తెలంగాణ సెంటిమెంట్ ఉన్నప్పటికీ పూర్తిగా కోల్పోవడం లేదంటున్నారు.

వాపు-బలుపు: జగన్‌కు 'సెంటిమెంట్' ట్విస్ట్!

సీమాంధ్రలో వలె జగన్ పార్టీ తెలంగాణలో తన ప్రభావం చూపించలేక పోవచ్చునని అంటున్నారు. కొత్తగా పుట్టిన పార్టీ కావడంతో ఆ పార్టీకి క్యాడర్ లేదని, తెలంగాణలో షర్మిల పాదయాత్రలో కూడా అది స్పష్టంగా కనిపిస్తోందని తెలంగాణవాదులు అంటున్నారు.

వాపు-బలుపు: జగన్‌కు 'సెంటిమెంట్' ట్విస్ట్!

దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి సెంటిమెంట్ సీమాంధ్రలో జగన్‌కు కలిసి వచ్చినట్లు తెలంగాణలో కలిసి వచ్చే అవకాశాలు లేవంటున్నారు. తెలంగాణ సెంటిమెంట్ తప్ప ఇక్కడా ఏ సెంటిమెంట్ పని చేయదంటున్నారు. నేతలు చేరుతున్నారు తప్ప ప్రజలు మాత్రం మొగ్గుచూపడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. నేతలు కేవలం సొంత పార్టీల పట్ల అసంతృప్తితోనే, హవా కొనసాగుతుందేమోననే ఆలోచనతోనే, కెసిఆర్ పట్ల ఉన్న వ్యతిరేకతతోనో చేరుతున్నారని చెబుతున్నారు. సీమాంధ్రలో జగన్‌కు వైయస్ సెంటిమెంట్ కారణంగా బలం ఉన్నదన్నది ఎంత నిజమో అదే ప్రాంతీయ సెంటిమెంట్ కారణంగా ఆయన పార్టీకి తెలంగాణలో బలం లేదన్నది అంతే నిజమని అంటున్నారు.

వాపు-బలుపు: జగన్‌కు 'సెంటిమెంట్' ట్విస్ట్!

స్థానిక నేతలు బలంగా ఉంటే కొంత కలిసొస్తుందే తప్ప తెలంగాణ సెంటిమెంట్‌ను బీట్ చేయలేరంటున్నారు. ఒకవేళ జగన్ తెలంగాణపై స్పష్టమైన వైఖరి చెబితే ఆదరించే అవకాశాలే కాకుండా తెలంగాణ రాష్ట్ర సమితిని బీట్ చేసే అవకాశాలు కూడా కొట్టి పారేయలేమంటున్నారు. అయితే జగన్ పార్టీ నేతలు మాత్రం తెలంగాణపై తమ పార్టీ స్పష్టంగా ఉందని, తమ చేతుల్లో తెలంగాణ అంశం లేదని చెబుతున్నారు. తెలంగాణలో తమ పార్టీ ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు గెలుచుకోవడం ఖాయమంటున్నారు.

ఇంకా చెప్పాలంటే తెలంగాణ సెంటిమెంట్ తప్ప మరే సెంటిమెంట్ తెలంగాణలో కనిపించడం లేదంటున్నారు. తెలంగాణ సెంటిమెంట్ బలంగా ఉన్నప్పటికీ కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలకు ఉన్న క్యాడర్ కారణంగానే ఆ పార్టీలు కష్టంగానైనా నెగ్గుకొస్తున్నాయని అంటున్నారు. అయితే నిన్న గాక మొన్న పుట్టిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి క్యాడర్ లేనందున దానికి తెలంగాణలో ఏమాత్రం బలం లేదని చెబుతున్నారు. అందుకే షర్మిల పాదయాత్రకు కూడా అంత ఆదరణ కనిపించడం లేదని విపక్షాలు విమర్శిస్తున్నాయని అంటున్నారు.

పరకాల ఉప ఎన్నికల వరకు తెలంగాణ వైపు చూడని వైయస్ జగన్ ఆ తర్వాతనే ఇటువైపు దృష్టి సారించారని గుర్తు చేస్తున్నారు. వరంగల్ జిల్లాలో ముఖ్యంగా పరకాల నియోజకవర్గంలో మాజీ మంత్రి కొండా సురేఖకు ఉన్న పట్టు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని, వారికున్న పట్టు కారణంగానే సురేఖ ఉప ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచారని చెబుతున్నారు. కానీ మిగిలిన చాలా నియోజకవర్గాలలో ఆ పార్టీలో ఉన్న నేతలకు అంత సీన్ లేదంటున్నారు.

సీమాంధ్రలో జగన్ హవాను, పరకాలలో కొండా దంపతుల పట్టునే జగన్ బలంగా భావించి చాలామంది నేతలు ఆ పార్టీలోకి వెళ్తున్నారని కానీ, తెలంగాణ సెంటిమెంట్ ముందు ఏదీ పని చేయకపోవచ్చునని చెబుతున్నారు. సీమాంధ్రలో టిడిపి, కాంగ్రెసులకు ముచ్చెమటలు పోయించిన జగన్ ఢిల్లీ పెద్దలను కూడా వణికిస్తున్నారని కానీ, అలాంటి నేతకు రెండేళ్ల క్రితం వరంగల్ జిల్లాలో ఎదురైన పరాభవాన్ని గుర్తు తెచ్చుకోవాలని చెబుతున్నారు.

తెలంగాణకు అనుకూలంగా ఉంటే తప్ప జగన్‌ను, ఆయన పార్టీని తెలంగాణ ప్రజలు స్వాగతించే పరిస్థితి ఉండదంటున్నారు. అప్పటి వరకు తెలంగాణ ప్రాంతం నుండి సీమాంధ్ర హవాను, పరకాల జోరును చూసి నాయకులు చేరుతారే తప్ప ప్రజలు మద్దతుగా నిలిచే అవకాశం లేదంటున్నారు. తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే మాత్రం జగన్ తెలంగాణ రాష్ట్ర సమితిని బీట్ చేయడం ఖాయమంటున్నారు. అప్పటి వరకు నాయకుల చేరిక జోరు వాపుగానే పరిగణించాల్సి ఉంటుందంటున్నారు.

English summary
It is said that Telangana people will accept YSR Congress party and party chief YS Jaganmohan Reddy after taking decision on Telangana only.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X