చండీగఢ్ హైటెక్ కాపీయింగ్‌: టాలీవుడ్ నిర్మాత డైరెక్షన్

 Tollywood producer in High tech copying
హైదరాబాద్/చండీగఢ్: చండీగఢ్ మెడికల్ పిజి ఎంట్రన్స్ పరీక్షలో హైటెక్ కాపీయింగ్ వ్యవహారంలో టాలీవుడ్ నిర్మాత ప్రమేయం ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఓ చిత్ర సహ నిర్మాతను సిబిఐ అధికారులు అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. హైదరాబాద్ కేంద్రంగా ఇతను ఓ ఫిల్మ్ కార్పోరేషన్‌ను నడిపిస్తున్నారని, అతను ఒక చిత్రాన్ని నిర్మించాడని సిబిఐ గుర్తించినట్లుగా తెలుస్తోంది. ఇతర సినిమాల్లో పెట్టుబడులపై కూడా సిబిఐ ఆరా తీస్తోంది.

సిబిఐ అదుపులోకి తీసుకున్నది తారకరత్న హీరోగా వచ్చిన నందీశ్వరుడు చిత్ర నిర్మాత గంగాధర్ రెడ్డిగా తెలుస్తోంది. అతనిని సిబిఐ విచారించేందుకు అదుపులోకి తీసుకుంది. అతను సినిమాలు నిర్మించిన తీరు పైనా సిబిఐ కన్నేసింది. ఇతను కెఎఫ్‌సి పేరుతో ఓ బ్యానర్ కూడా ఉందని తెలుస్తోంది.

కాగా వైద్యవిద్య ప్రవేశ పరీక్షలో హైటెక్ కాపీయింగ్ పదిహేను రోజుల క్రితం బట్టబయలైన విషయం తెలిసిందే. వైద్య విద్యా సంస్థల్లో చండీగఢ్ పిజిఐఎంఈఆర్‌కు దేశంలోనే ప్రత్యేక స్థానం ఉంది. పిజిఐలోని వివిధ విభాగాల్లో పిజి వైద్య కోర్సుల కోసం నిర్వహించిన ప్రవేశ పరీక్షలో అత్యాధునిక పరికరాలతో కాపీయింగ్‌కు పాల్పడుతూ చండీగఢ్‌లో పలు రాష్ట్రాలకు చెందిన వారు దొరికిపోయారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి దేశవ్యాప్తంగా కాపీయింగ్‌కు పాల్పడుతున్న పెద్ద ముఠాను అప్పుడు సిబిఐ అరెస్టు చేసింది.

ఏడుగురు మహిళా వైద్యులతో సహా మొత్తం 17 మందిని సిబిఐ అరెస్టు చేసింది. వీరిలో ముగ్గురు వైద్యులు ఆంధ్ర ప్రదేశ్‌కి చెందిన వారు కూడా ఉన్నారు. ఈ పరీక్షకు దేశవ్యాప్తంగా ఏడు వేలమంది హాజరవుతున్నారు. సిబిఐకి చెందిన అవినీతి నిరోధక విభాగం అధికారులు ఈ పరీక్షలు జరుగుతున్న కేంద్రాలపై ఆకస్మిక దాడులు చేశారు. నాలుగు కేంద్రాల్లో హైటెక్ కాపీయింగ్‌కు పాల్పడుతున్న ఏడుగురు విద్యార్థినులు వారికి చిక్కారు.

అత్యాధునిక లాప్‌టాప్‌లు, మైక్రోఫోన్లు, సూక్ష్మ కెమెరాలు, ఫోన్లు, బ్లూటూత్, వైర్‌లెస్ ఇయర్ ప్లగ్‌లు వంటి పరికరాలను ఉపయోగించి ఈ ముఠా కాపీయింగ్‌కు పాల్పడింది. ఎవరికీ కనపడకుండా దుస్తులకు పెట్టుకున్న కెమెరాలు, ఫోన్లతో వీరు ప్రశ్నపత్రాన్ని చిత్రీకరించి, బయటకు పంపేవారు. ఈ ప్రశ్నపత్రాన్ని బయట ఉన్న ఏడుగురు వ్యక్తులు తీసుకొని, హైదరాబాద్, పాట్నాల్లో ఉన్న నిపుణులకు పంపేవారు.

నిపుణులు పంపిన సమాధానాలను విద్యార్థులకు బ్లూటూత్, వైర్‌లెస్ ఇయర్ ఫోన్ల ద్వారా అందించేవారని సిబిఐ ఓ ప్రకటనలో తెలిపింది. కాపీయింగ్ కోసం విద్యార్థులు అత్యాధునిక పరికరాలను అమర్చుకొనే విధంగా ప్రత్యేక దుస్తులను ధరించారని సిబిఐ వెల్లడించింది. ఈ దుస్తుల్లో బటన్ కెమెరాలు, ఫోన్లు, మైక్రోఫోన్లు, బ్లూటూత్ వంటి పరికరాలు ఎవరికీ కనపడకుండా ఇమిడిపోతాయి. దీంతో ఎవరికీ అనుమానం కలగదు. ఏడుగురు విద్యార్థినులతో సహా మొత్తం 17 మందిని అరెస్టు చేసినట్లు సిబిఐ వెల్లడించింది. ఈ కేసును విచారిస్తున్న సిబిఐ తాజాగా టాలీవుడ్ నిర్మాతను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లుగా తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+