భార్య నుంచి అఫైర్ దాచిపెట్టాలని లవర్ హత్య

తన ప్రియురాలు రీనా మృతదేహాన్ని ప్యాక్ చేసి ఓం దత్తు (23) దాన్ని తన తండ్రి మారుతి కారులో తీసుకుని వెళ్లి పారేయాలని అనుకున్నాడు. అప్రమత్తంగా ఉన్న గస్తీ కానిస్టేబుల్ దాన్ని గుర్తించి దత్తును పట్టుకున్నాడు. ఉత్తమ్ నగర్ పోలీసు స్టేషన్‌లో హత్య కేసు నమోదైంది. గురువారంనాడు ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది.
ఓం విహార్ ఫేజ్ - 1లో నివసించే దత్తు శానిటరీ ఐటమ్స్ సరఫరా చేస్తుంటాడు. ఏడాదిన్నర క్రితం అతనికి పెళ్లయింది. ఉత్తమ్ నగర్‌లో రోజూవారీగా దుకాణాలకు తిరుగుతున్న క్రమంలో 8 నెలల క్రితం రీనా పరిచయమైంది. ఇద్దరి మధ్య వైవాహికేరత సంబంధం ఏర్పడింది. కొద్ది రోజుల క్రితం రీనా తండ్రి చనిపోయాడు. ఇద్దరు తమ్ముళ్లు ఆమెపై ఆధారపడి ఉన్నారు. దీంతో ఆమె ఓం దత్తును డబ్బులు అడగడం ప్రారంభించింది.
పైగా, తనను పెళ్లి చేసుకోవాలని రీనా డిమాండ్ చేస్తూ వచ్చింది. రెండు కుటుంబాలకు డబ్బులు సర్ద లేక దత్తు ఇబ్బంది పడ్డాడు. బుధవారం రాత్రి దత్తు రీనా ఉంటున్న అర్జన్ విహార్‌కు వెళ్లాడు. అప్పుడు ఇరువురి మధ్య గొడవ చోటు చేసుకుంది. ఈ సమయంలో దత్తు రీనా గొంతు నులిమి చంపేశాడు. ఆ తర్వాత తండ్రి కారులో మృతదేహాన్ని తీసుకుని తరలించడానికి ప్రయత్నించాడు. దత్తు నేరాన్ని అంగీకరించాడు.












Click it and Unblock the Notifications