బాబు పాలనలా కిరణ్ రెడ్డి పాలన: విజయమ్మ

YS Vijayamma
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పాలన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి పాలనను తలపిస్తోందని వైయస్సార్ కాంగ్రెసు శానససభా పక్ష నేత వైయస్ విజయమ్మ అన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్‌పై చర్చలో ఆమె పాల్గొన్నారు. సబ్ ప్లాన్‌కు చట్టబద్ధత కల్పించడానికి మద్దతు తెలుపుతూనే ఆమె ప్రభుత్వంపై విమర్శలు చేశారు.

వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలోనే దళితులకు న్యాయం జరిగిందని ఆమె అన్నారు. రాష్ట్రం ఎస్టీల అక్షరాస్యత విషయంలో అట్టడుగున ఉందని ఆమె చెప్పారు. ఎస్టీల అభివృద్ధికి సరైన చర్యలు తీసుకోవడం అవసరమని ఆమె అన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్‌ను దేశవ్యాప్తంగా ఎందుకు అమలు చేయరని విజయమ్మ ప్రశ్నించారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ బిల్లు మేడిపండులా ఉందని, పొట్ట విప్పి చూస్తే పురుగులు ఉన్నాయని సిబిఐ శాసనసభా పక్ష నేత గుండా మల్లేష్ అన్నారు. ఏదో బిల్లు పెట్టి చేతులు దులుపుకోకుండా దాన్ని అమలు చేయడంలో చిత్తశుద్ధి ప్రదర్శించాలని ఆయన సూచించారు. పకడ్బందీగా చట్టం అమలు చేయకపోతే బిల్లు నిరుపయోగమేనని ఆయన అన్నారు.

ప్రాచీన కాలం నుంచి ఎస్సీల జీవితాల్లో ఎలాంటి మార్పు రాలేదని రాష్ట్ర మంత్రి జె. గీతారెడ్డి అన్నారు. ఎస్సీ, ఎస్టీలకు దక్కాల్సిన నిధులు వారికి దక్కాలని ఆమె అన్నారు. ఈ ప్రణాళిక బిల్లు కోసం అణగారిన వర్గాలు చాలా కాలంగా ఎదురు చూస్తున్నాయని ఆమె అన్నారు. నిధుల మంజూరులో నిర్లక్ష్యంగా వ్యవహరంచే అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు. పార్టీలకు అతీతంగా బిల్లుకు సభ్యులు మద్దతు తెలపాలని ఆమె కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+