వారు భయపడుతున్నారు: రోజా, షర్మిలతో నడక

తమ పార్టీ ప్రభంజనాన్ని చూసి తెరాస నాయకులు భయపడుతున్నారని ఆమె అన్నారు. తెరాసను ప్రజలను విశ్వసించడం లేదని అన్నారు. ప్రజలు కోరుకున్నవారే నాయకులు అవుతారని ఆమె అన్నారు. విమర్శలు చేసేవాళ్లు నాయకులు కాలేరని రోజా అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి కుటుంబం వెంట ఉండి మనోధైర్యం ఇస్తున్న ప్రజలకు రోజా కృతజ్ఞతలు తెలిపారు. షర్మిల పాదయాత్రలో శనివారం కొంత మంది న్యాయవాదులు కూడా పాల్గొన్నారు.
తెరాస పట్టు కోల్పోయింది: సురేఖ
ఏలూరు: తెలంగాణలో తెరాస పూర్తిగా పట్టు కోల్పోయిందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకురాలు కొండా సురేఖ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మండలం ప్రగడవరంలో శనివారం ఆమె పర్యటించారు. అక్కడి దళితవాడ, మిల్లు సెంటర్‌లో వైయస్ విగ్రహాలను ఆవిష్కరించారు. ఈ అవినీతి ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోవచ్చునని సురేఖ అన్నారు. అధికార పక్షానికి ప్రతిపక్షం బాసటగా నిలుస్తోందని ఆమె విమర్శించారు.
చంద్రబాబుకు గుండెదడ: అంబటి
తమ పార్టీని పిల్ల కాంగ్రెసు అంటూ విమర్శిస్తున్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అదే పార్టీ దెబ్బకు హెలికాప్టర్ వదిలేసి పాదయాత్ర ప్రారంభించారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. ఇప్పటికే తమ పార్టీ అంటే చంద్రబాబుకు గుండె దడ పట్టుకుందని ఆయన వ్యాఖ్యానించారు. చంద్రబాబుకు వచ్చే ఎన్నికల్లో తమ దెబ్బ చూపించబోతున్నామని అన్నారు.
విశాఖపట్నం పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న అనంతరం ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. వైయస్ రాజశేఖర రెడ్డి మరణంపై ఇప్పటికీ ఎన్నో సందేహాలున్నాయని ఆయన అన్నారు. హెలికాప్టర్ ప్రమాదంపై త్యాగి ఇచ్చిన నివేదికను తాము ఖండిస్తున్నామని చెప్పారు. వైయస్ రాజశేఖర రెడ్డి మరణంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించడానికి ఎందుకు వెనకాడుతున్నారని ఆయన అడిగారు.












Click it and Unblock the Notifications