హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గొడవ: టీవీ రిమోట్ ఇవ్వలేదని యువతి ఆత్మహత్య

By Pratap
|
Google Oneindia TeluguNews

Hyderabad
హైదరాబాద్: టీవీ రిమోట్ కోసం ఆక్కాచెల్లెళ్ల మధ్య జరిగిన గొడవ ఓ కుటుంబంలో విషాదాన్ని నింపింది. చెల్లెతో టీవి రిమోట్ కోసం పోరాడి ఓడిన అక్క ఉరేసుకుని మరణించింది. చావుబతుకుల మధ్య ఉన్న 18 ఏళ్ల యువతిని తల్లిదండ్రులు ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె మరణించింది.

హైదరాబాదులోని కాంచన్‌బాగ్ పోలీసు స్టేషన్ పరిధిలోని హఫీజ్ బాబా నగర్‌లోని జావెద్ అలీ కుటుంబంలో ఆ సంఘటన గురువారం చోటు చేసుకుంది. అలీ పాతబస్తీలోని బట్టల దుకాణంలో పనిచేస్తాడు. బాబ్రీ మసీదు కూల్చివేతపై నిరసన వ్యక్తం చేస్తూ ఈ నెల 6వ తేదీన పాతబస్టీలో బంద్ జరిగింది. దీంతో అలీ ఇద్దరు కూతుళ్లు ఆర్షియా, అమీనా ఇంట్లోనే ఉన్నారు.

పెద్ద కూతురు ఆర్షియా మలక్‌పేటలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతోంది. ఆమె 14 ఏళ్ల చెల్లె అమీనా స్థానిక పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది. అమీనా టీవీ చూస్తుండగా ఉదయం 11 గంటల ప్రాంతంలో ఇరువురి మధ్య గొడవ ప్రారంభమైంది. అర్షియా రిమోట్ తీసుకుని చానెళ్లను మార్చడం ప్రారంభించింది. దీంతో ఇరువురి మధ్య రిమోట్ కోసం పెనుగులాట జరిగింది.

ఆ సమయంలో తల్లిదండ్రులు జోక్యం చేసుకుని అమీనాకు మద్దతుగా నిలిచారు. టీవీ రిమెట్ చెల్లెకు ఇచ్చేయాలని అర్షియాకు చెప్పారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన అర్షియా వేరే గదిలోకి వెళ్లి తలుపులు వేసేసుకుంది. చాలా సేపటి వరకు కూతురు బయటకు రాకపోవడంతో తల్లిదండ్రులు తలుపులు పగులగొట్టారు. కూరుతు ఉరేసుకుని ఉండడం గమనించి, వెంటనే ఆస్పత్రికి తరలించారు.

English summary
The fight for control of a TV remote between two sisters ended in a tragedy for a family when the older sibling who lost the battle hanged herself. Although the parents realized that something was amiss and rushed the 18-year-old daughter to the hospital when they found some life in her, the girl breathed her last later in the day.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X