90శాతం ఇండియన్లు ఇడియట్స్, మెదళ్లు లేవు: కట్జూ

ఏదైనా ఒక ప్రార్థనా స్థలం వద్ద అవతలి వారిని అగౌరవపరిచేలా ప్రవర్తిస్తే చాలని వెంటనే పరస్పరం కొట్టుకోవడం ప్రారంభిస్తారని అన్నారు. 1857కు ముందు అసలు దేశంలో మతమౌఢ్యం అన్నదే లేదని, కానీ ఇప్పటి పరిస్థితి వేర్నారు. ఇటు హిందువుల్లోను, అటు ముస్లింలలోను 80 శాతం మంది మతమౌఢ్యులేనని, ఇది కఠోర వాస్తవమైనా తాను చెబుతున్నానన్నారు.
ఇంగ్లీషు భాష అందరిలో విషాన్ని నింపుతోందన్నారు. సిపాయిల తిరుగుబాటు తర్వాత దేశాన్ని నియంత్రించేందుకు హిందూ - ముస్లింలు కొట్టుకునేలా చేయాలని ఇంగ్లీష్ వారు భావించారన్నారు. అప్పటి నుండి అది కొనసాగుతోందన్నారు. హిందీ హిందువుల భాషగాను, ఉర్దూను ముస్లింల భాషగాను ప్రచారం చేశారన్నారు. భారతీయులు మూర్ఖులుగా ఉండకూడదనే తానీ కఠోర వాస్తవాలు చెబుతున్నానని అన్నారు.
భారత-పాకిస్థాన్‌ల విలీనమే కాశ్మీర్ సమస్యకు ఏకైక పరిష్కారం అన్నారు. కులం, జాతి ప్రాతిపదికన ఓటేయడం ద్వారా ఎంత వెనుకబడిపోయామో తెలియాలంటే గట్టి దెబ్బ తలగాలన్నారు. అప్పుడే స్పృహలోకి వస్తారన్నారు. యుద్ధరంగంలో వార్తా సేకరణకు ప్రాణాలొడ్డమని తాను చెప్పనని, తుపాకీ కణతకు పెట్టినప్పుడు సిద్ధంతాలు ముఖ్యం కాదన్నారు. ప్రాణాలు లేకపోతే ఏవీ లేవని, మౌనంగా తప్పుకోవడమే ముఖ్యమన్నారు.












Click it and Unblock the Notifications