శ్రీకాళహస్తిలో తమిళనాడు వాసి దారుణ హత్య

పారిపోడానికి ప్రయత్నించిన రమేష్‌ను దుండగులు వెంటాడి నరికి చంపారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని కేసు నమోదు చేశారు. పోలీసులు వెంటనే అప్రమత్తమై నిందితుల కోసం వేట ప్రారంభించారు. దీంతో వరదాయపాలెంలో ఇద్దరు నిందితులను పోలీసులు పట్టుకున్నారు. మరో ముగ్గురు పరారయ్యారు. దాడికి గల కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు.
ఓ హత్యకు ప్రతీకారంగానే రమేష్‌ను ప్రత్యర్థులు చంపి ఉంటారని అనుమానిస్తున్నారు. ఓ వ్యక్తి హత్య కేసులో అతని ప్రమేయం ఉందని భావించి ఈ దారుణానికి ఒడిగట్టారని చెబుతున్నారు. రమేష్ చెన్నైలోని తాంబారం ప్రాంతానికి చెందినవాడని తెలుస్తోంది.
గుంటూరు జిల్లాలో దారుణమైన హత్య చోటు చేసుకుంది. గుంటూరు జిల్లా మాచర్ల మండలం ఏకోనంపేటలో పాత కక్షలతో ప్రత్యర్థులు ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. ఈ సంఘటనలో మరో వ్యక్తికి గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications